Beauty Tips

Hair Care Tips:ఈ ఆయుర్వేద చిట్కా వాడితే ఒక్క వెంట్రుక కూడా రాలకుండా జుట్టు పెరుగుతుంది

Hair Care Tips:ఈ ఆయుర్వేద చిట్కా వాడితే ఒక్క వెంట్రుక కూడా రాలకుండా జుట్టు పెరుగుతుంది.. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలో కాల్షియం, ఐరన్ లోపం ఉన్నప్పుడు కూడా జుట్టు రాలుతుంది.

ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలడం సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా మార్కెట్లో లభించే నూనెలు, షాంపూలను ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ జుట్టు రాలడం ఆగకపోతే? అలాంటప్పుడు సరళమైన ఆయుర్వేద చిట్కాలను అనుసరిస్తే ఈ సమస్యను సులభంగా నియంత్రించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం…
Ghee Health benefits
జుట్టు రాలడానికి బహుళ కారణాలు ఉంటాయి. శరీరంలో కాల్షియం, ఐరన్ లోపించడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, థైరాయిడ్ సమస్యలు, ఒత్తిడి, లేదా పోషకాహార లోపం వంటివి కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. అయితే, ఏ కారణంతో జుట్టు రాలినప్పటికీ, ఆయుర్వేదంలో దీనికి సమర్థవంతమైన పరిష్కారం ఉంది. మీ ఇంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంటే చాలు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం ముక్కులో రెండు చుక్కల ఆవు నెయ్యి వేసుకోవాలి.

ఇలా మూడు వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే, జుట్టు రాలడం గణనీయంగా తగ్గుతుంది. ఇది జుట్టు రాలడాన్ని ఆపడమే కాకుండా, జుట్టు ఒత్తుగా పెరగడానికి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడానికి, మంచి నిద్ర కోసం కూడా సహాయపడుతుంది. తరచూ తలనొప్పితో బాధపడేవారికి కూడా ఈ చిట్కా ఉపశమనం కలిగిస్తుంది. అయితే, ఈ పద్ధతిని అనుసరించే ముందు ఆయుర్వేద వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

జుట్టుకు అవసరమైన పోషకాలు ఆహారం ద్వారా మాత్రమే కాకుండా, తలకు నేరుగా పోషణ అందించడం కూడా ముఖ్యం. ఇందుకోసం కొబ్బరి నూనె, బ్రింగరాజ్, వేప, మందార వంటి మూలికలు కలిసిన హెయిర్ ఆయిల్‌ను ఉపయోగించాలి. ఈ నూనె ఒత్తిడి, నిద్రలేమి, థైరాయిడ్ లేదా ఇతర వ్యాధుల వల్ల జుట్టు రాలడాన్ని అద్భుతంగా నియంత్రిస్తుంది. ఈ నూనెకు బదులుగా మందార, వేప, బ్రింగరాజ్ వంటి మూలికలతో తయారైన హెయిర్ మాస్క్‌లను కూడా వాడవచ్చు, ఇవి కూడా అద్భుత ఫలితాలను ఇస్తాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ