Business

Jio Vs AirTel Vs Bsnl:జియో, ఎయిర్‌టెల్‌లను అధిగమించేలా బిఎస్ఎన్ఎల్ రూ.299 రీచార్జ్ ప్లాన్

Jio Vs AirTel Vs Bsnl: జియో, ఎయిర్‌టెల్‌లను అధిగమించేలా బిఎస్ఎన్ఎల్ రూ.299 రీచార్జ్ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

జియో, ఎయిర్‌టెల్‌తో బిఎస్ఎన్ఎల్ పోటీ
ప్రైవేట్ టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్‌తో పాటు ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కూడా తమ కస్టమర్లకు రూ.299 ప్లాన్‌లను అందిస్తోంది. అయితే, ఈ మూడు ప్లాన్‌లలో ఏది ఉత్తమం? ఏ ప్లాన్‌లో ఎక్కువ డేటా, ఇతర ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

జియో రూ.299 రీచార్జ్ ప్లాన్
రిలయన్స్ జియో రూ.299 ప్లాన్ ఎక్కువ డేటా, అపరిమిత కాల్స్ కావాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా అందిస్తుంది, అంటే మొత్తం 42GB డేటా. ఇంకా, రోజుకు 100 ఉచిత SMSలు, జియోటివి, జియోక్లౌడ్ యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తాయి.

ఎయిర్‌టెల్ రూ.299 రీచార్జ్ ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కానీ ఇందులో రోజుకు 1GB డేటా, అంటే మొత్తం 28GB డేటా మాత్రమే లభిస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఉచిత SMSలు ఉన్నాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్, వింక్ మ్యూజిక్, అపోలో 24/7 సర్కిల్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

బిఎస్ఎన్ఎల్ రూ.299 రీచార్జ్ ప్లాన్
బిఎస్ఎన్ఎల్ రూ.299 ప్లాన్ ఇతర కంపెనీల కంటే ఆకర్షణీయంగా ఉంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3GB డేటా అందిస్తుంది, అంటే మొత్తం 90GB డేటా. అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఉచిత SMSలు ఉన్నాయి.