Beauty Tips

Hair Care Tips:బియ్యం నీటిలో ఈ రెండు పదార్థాలు కలిపి జుట్టుకు రాస్తే చాలు.. ఒక్క వెంట్రుక కూడా రాలదు!

Hair CAre Tips:బియ్యం నీటిలో ఈ రెండు పదార్థాలు కలిపి జుట్టుకు రాస్తే చాలు.. ఒక్క వెంట్రుక కూడా రాలదు..రైస్ వాటర్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనకు తెలిసిందే. దీన్ని క్రమం తప్పకుండా జుట్టుకు ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు. అయితే, బియ్యం నీటిలో రెండు పదార్థాలను కలిపి వాడితే మరింత ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఆ పదార్థాలు ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.ప్రస్తుతం చాలామంది జుట్టు రాలడం, తెగడం, తెల్లబడటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. రైస్ వాటర్ వాడకం ద్వారా ఈ సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు. బియ్యం నీటిలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

బియ్యం నీటిలో మెంతులు, కరివేపాకు కలిపి ఉపయోగిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు త్వరగా నల్లగా, పొడవుగా పెరుగుతుంది. మెంతుల్లోని ప్రోటీన్లు జుట్టు కుదుళ్లను బలపరిచి, రాలడాన్ని నివారిస్తాయి. అంతేకాకుండా, మెంతుల్లోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చుండ్రు సమస్యను తగ్గిస్తాయి. కరివేపాకులో ఉండే ఐరన్, బీటా కెరోటిన్ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి మరియు జుట్టు తెల్లబడటాన్ని అడ్డుకుంటాయి.

తయారీ విధానం:
ఒక గ్లాసు నీటిలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 10-15 కరివేపాకులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వీటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌గా చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు జాగ్రత్తగా అప్లై చేయాలి. అరగంట నుంచి ఒక గంట వరకు అలాగే ఉంచి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

ఉపయోగ విధానం:
ఈ బియ్యం, మెంతులు, కరివేపాకు నానబెట్టిన నీటిని వారానికి రెండు సార్లు ఉపయోగించవచ్చు. ప్రతిసారి తాజాగా తయారు చేసుకోవడం ఉత్తమం. మొదటిసారి వాడే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయాలి, ఎందుకంటే కొందరికి ఈ మిశ్రమం వల్ల దురద లేదా మంట రావచ్చు. అందుకే ముందుగా చిన్న భాగంలో పరీక్షించి, సమస్య లేకపోతే వాడటం మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ