Beauty Tips

Hair care Tips:జుట్టు ఒత్తుగా, వేగంగా పెరగాలంటే ఈ నూనె ఒక్కటి చాలు..

Hair Care Tips:జుట్టు ఒత్తుగా, వేగంగా పెరగాలంటే ఒక్కటే మార్గం: ఇంట్లోనే సహజ నూనె తయారుచేసుకోండి, ఎలా అనేది తెలుసా.. జుట్టు ఒత్తుగా పెరగాలంటే సహజమైన నూనెతో మాత్రమే సాధ్యం. ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే ఈ నూనె జుట్టును ఆరోగ్యవంతంగా, మెరిసేలా చేస్తుంది. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు, అప్లై చేసే పద్ధతి గురించి వివరంగా తెలుసుకుందాం.

జుట్టు పెరుగుదలకు నూనె రాయడం సాధారణ సలహా. అయితే, ఏ నూనె వాడుతున్నామనేది ముఖ్యం. సరైన నూనె ఎంచుకోవడమే సగం సమస్యను తీరుస్తుంది. మార్కెట్‌లో కొనడానికి బదులు, ఇంట్లోనే తయారుచేసుకుంటే మరింత మంచిది. ఇది సులభం, శ్రమ తక్కువ. కేవలం 5-6 పదార్థాలతో జుట్టును ఒత్తుగా పెంచి, మెరుగుపరిచే నూనె సిద్ధమవుతుంది.ఈ విధానాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ వివరించారు. సహజ జుట్టు పెరుగుదల నూనె తయారీ గురించి పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
ఈ సహజ నూనెకు కొన్ని సాధారణ పదార్థాలు అవసరం. ఆలివ్ ఆయిల్ (జుట్టు పెరుగుదలకు ఉత్తమం), డ్రైడ్ రోజ్‌మేరీ (పోషకాలు అందిస్తుంది), కలోంజి గింజలు (జుట్టు నల్లగా ఉంచుతాయి), మెంతులు (కుదుళ్లను బలోపేతం చేస్తాయి), వెల్లుల్లి రెబ్బలు (పోషకాలు అందిస్తాయి), లవంగాలు (యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి). ఈ పదార్థాలన్నీ యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి, జుట్టు వేగంగా పెరిగేలా సహాయపడతాయి.

మోతాదులు:
ఒక కప్పు ఆలివ్ ఆయిల్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ డ్రైడ్ రోజ్‌మేరీ, 1 టేబుల్ స్పూన్ కలోంజి గింజలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 3 వెల్లుల్లి రెబ్బలు, 4 లవంగాలు. ఈ మోతాదులు ఖచ్చితంగా పాటించండి, ముఖ్యంగా కలోంజి, రోజ్‌మేరీల విషయంలో. ఇవి నూనె సామర్థ్యాన్ని పెంచుతాయి.

తయారీ విధానం:
ముందుగా ఆలివ్ ఆయిల్‌ను స్వల్పంగా వేడి చేయండి (మరిగించకండి). వేడి అయిన తర్వాత రోజ్‌మేరీ, కలోంజి, మెంతులు, వెల్లుల్లి, లవంగాలు వేసి, 10 నిమిషాలు అలాగే ఉంచండి. స్టవ్ ఆఫ్ చేసి, చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వడపోసి, గాజు జార్‌లో నిల్వ చేయండి.

వాడే విధానం:
నూనెను వాడేముందు స్వల్పంగా వేడి చేయండి. వారానికి 2-3 సార్లు తలకు పూసి, కుదుళ్ల వరకు మసాజ్ చేయండి (కనీసం 10 నిమిషాలు). రాత్రంతా లేదా కనీసం 1 గంట ఉంచి, సాధారణంగా తలస్నానం చేయండి.

ఇతర సూచనలు:
మొదటిసారి ప్యాచ్ టెస్ట్ చేయండి. సెన్సిటివ్ చర్మం ఉన్నవారు వాడకండి. చల్లని ప్రదేశంలో నిల్వ చేయండి (4 వారాలు చెడిపోదు). నూనె రాసిన తర్వాత టవల్ చుట్టుకుంటే మరింత ప్రభావం.

రోజ్‌మేరీ ప్రయోజనాలు
ఈ మధ్య కాలంలో జుట్టు సమస్యలకు చెక్ పెట్టటానికి rosemary చాలా ప్రాచుర్యం పొందింది. ఇక ప్రయోజనాల విషయానికి వస్తే.. జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగాలని చాలా మంది కోరుకుంటారు. దీనికి సమతుల ఆహారం, సరైన జుట్టు సంరక్షణ చాలా ముఖ్యం. ఈ సమస్యలకు రోజ్‌మేరీ ఒక అద్భుతమైన పరిష్కారం. ఈ ఆకులు పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. రోజ్‌మేరీ ఆకులు తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి మరియు జుట్టు కుదుళ్ళకు అవసరమైన పోషణను అందిస్తాయి.

తలకు పోషణ
రోజ్‌మేరీలో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చుండ్రు, దురద వంటి సమస్యలను తొలగిస్తాయి. ఇది తలకు రక్త ప్రసరణను పెంచడమే కాక, తలను తేమగా ఉంచుతుంది. దీని కోసం షాంపూ చేసిన తర్వాత రోజ్‌మేరీ వాటర్‌తో తలను శుభ్రం చేసుకోవాలి.

రోజ్‌మేరీతో జుట్టుకు మెరుపు
రోజ్‌మేరీ జుట్టుకు మెరుపును, బలాన్ని అందిస్తుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా, బలంగా మార్చడంతో పాటు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. రోజ్‌మేరీ ఆయిల్‌ను డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసి తలకు రాస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

రోజ్‌మేరీ మసాజ్‌తో ప్రయోజనాలు
రోజ్‌మేరీ ఆయిల్‌తో తలకు మసాజ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్ జుట్టుకు పోషణనిస్తాయి. రక్త ప్రసరణ మెరుగుపడటం వల్ల జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. దీని కోసం రోజ్‌మేరీ ఆయిల్‌ను ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో కలిపి తలకు రాయాలి.

స్కాల్ప్‌ను చల్లగా ఉంచడం
ఒత్తిడి కారణంగా చాలా మందికి తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో రోజ్‌మేరీ ఆయిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నూనెను క్రమం తప్పకుండా జుట్టుకు రాస్తే, తల చల్లగా మారడంతో పాటు జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.

గమనిక: ఇది సాధారణ సమాచారం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. వాడే ముందు వైద్యుడిని సంప్రదించండి. తెలుగు సమయం ఈ సమాచారాన్ని ధృవీకరించదు, ఖచ్చితత్వానికి బాధ్యత వహించదు.