Chandra Grahan 2025 Time: చంద్రగ్రహణం 2025 సమయంలో ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు పాటించాలో తెలుసా..?
Chandra Grahan 2025 Time and full details in telugu : చంద్రగ్రహణం 2025 సమయంలో ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు పాటించాలో తెలుసా.. ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున, అంటే 2025 సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ రోజు రాత్రి 9:56 గంటల నుంచి 1:26 గంటల వరకు ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపించడం వల్ల దీనిని ‘బ్లడ్ మూన్’ అని కూడా పిలుస్తారు.
ఈ ఏడాది ఇదే చివరి చంద్రగ్రహణం కావడం విశేషం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ గ్రహణం మానసిక స్థితి, కెరీర్, సంబంధాలు, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ఈ ప్రభావం ఒక్కో రాశి, నక్షత్రం, జన్మతేదీ బట్టి వేర్వేరుగా ఉంటుంది. కొందరికి ఈ గ్రహణం అనుకూల ఫలితాలను ఇస్తే, మరికొందరికి మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది.
కొంత మంది జాతకాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అలాంటి వారు గ్రహణం కారణంగా వారి రాశి ప్రకారం ఏమైనా దోషాలు ఉంటే పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే కొంత మంది అసలు జాతకాలను నమ్మరు. అలాంటి వారు అసలు గ్రహణాలను కూడా పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ఇక గ్రహణం గుతుంచిన వివరాల్లోకి వెళ్ళితే..ఈ గ్రహణం గురించి, దాని ప్రభావాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
చంద్రగ్రహణం అంటే ఏమిటి?
చంద్రగ్రహణం అనేది సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు సంభవించే ఖగోళ సంఘటన. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడటం వల్ల చంద్రుడు పూర్తిగా కనిపించకపోవచ్చు లేదా ఎరుపు రంగులో కనిపిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో ఈ సంఘటనను చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. చంద్రుడు మానసిక స్థితి, భావోద్వేగాలు, ప్రశాంతత, తల్లిని సూచిస్తాడు. ఈ చంద్రగ్రహణం భారత్‌తో సహా ఆసియా ఖండంలోని రష్యా, సింగపూర్, చైనా వంటి దేశాల్లో కనిపించనుంది.

వ్యక్తిగత ప్రభావం
చంద్రగ్రహణం ప్రభావం వ్యక్తిగతంగా రాశి, నక్షత్రం, జాతకంలో చంద్రుడి స్థానం ఆధారంగా మారుతుంది. గ్రహణం ఏ రాశి, నక్షత్రంలో సంభవిస్తుందో ఆ రాశి వారిపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది. అలాగే, జాతకంలో చంద్రుడు ఏ ఇంట్లో ఉన్నాడు, గ్రహణ సమయంలో ఇతర గ్రహాల స్థితి ఎలా ఉంది అనే అంశాలపై కూడా ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఇవి కెరీర్, సంబంధాలు, వ్యాపారం వంటి అంశాల్లో మార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది.
సాధారణ ప్రభావాలు
ఈ గ్రహణం సమయంలో చాలా మంది మానసిక ఒత్తిడి, ఆందోళన, అస్థిరతను అనుభవించవచ్చు. ముఖ్యంగా జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కొందరికి జీర్ణ సమస్యలు, నిద్రలేమి, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మనసు గందరగోళంగా ఉండటం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడటం జరగవచ్చు. అలాగే, వ్యక్తిగత సంబంధాలు, కుటుంబం, వ్యాపార సంబంధాలపై కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మంత్ర జపం: చంద్రగ్రహణం సమయంలో ‘ఓం నమో నారాయణాయ’, ‘ఓం నమః శివాయ’, గాయత్రీ మంత్రం వంటి మంత్రాలను జపించడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు.
ఆహార నియమాలు: గ్రహణం ప్రారంభానికి ముందు లేదా ముగిసిన తర్వాత ఆహారం తీసుకోవడం మంచిది.
ధ్యానం మరియు ప్రార్థన: మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, దైవ ప్రార్థనలు చేయడం ఉపయోగకరం.
పవిత్ర స్నానం: గ్రహణం ముగిసిన తర్వాత నది లేదా చెరువులో స్నానం చేసి, సమీపంలోని ఆలయంలో పూజలు చేయడం శుభప్రదం.
గర్భిణీ స్త్రీలు: గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి.
దానం: ఆహారం, వస్త్ర దానం చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని చెబుతారు.
ముఖ్య గమనిక
ఈ సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిష్య శాస్త్రం, కొందరు నిపుణుల అభిప్రాయాల ఆధారంగా అందించబడింది. ఈ సమాచారాన్ని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత నిర్ణయం. chaipakodi ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు.

