BusinessToday gold rate

Gold Rate Today: రాకెట్ లా దూసుకెళ్తున్న పసిడి ధర… తులం బంగారం ధర రూ. 1.09 లక్షల పై మాటే..

Gold Rate Today: రాకెట్ లా దూసుకెళ్తున్న పసిడి ధర… తులం బంగారం ధర రూ. 1.09 లక్షల పై మాటే.. బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరగడం, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ బాగా పెరగడం వంటివి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

బంగారం ధరలు ఒక రోజు తగ్గినా, మరుసటి రోజు రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. ప్రస్తుతం, తులం బంగారం కొనాలంటే అన్ని పన్నులతో కలిపి దాదాపు రూ.1,07,000 పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. భారతీయ సంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది.

సెప్టెంబర్ 5, 2025 నాటికి దేశంలో బంగారం ధరలు ఆకాశమే అంటుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,850 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940గా ఉంది. వెండి ధర కిలోకు రూ.1,26,900 ఉండగా, హైదరాబాద్, చెన్నై, కేరళలో ఇది రూ.1,36,900గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాములు – రూ.1,07,000, 22 క్యారెట్ల 10 గ్రాములు – రూ.97,940
చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాములు – రూ.1,06,850, 22 క్యారెట్ల 10 గ్రాములు – రూ.97,940
హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాములు – రూ.1,06,850, 22 క్యారెట్ల 10 గ్రాములు – రూ.97,940
ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాములు – రూ.1,06,850, 22 క్యారెట్ల 10 గ్రాములు – రూ.97,940
బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాములు – రూ.1,06,850, 22 క్యారెట్ల 10 గ్రాములు – రూ.97,940
కేరళ: 24 క్యారెట్ల 10 గ్రాములు – రూ.1,06,850, 22 క్యారెట్ల 10 గ్రాములు – రూ.97,940

ధరల పెరుగుదలకు కారణాలు:
నిపుణుల ప్రకారం, ఆర్థిక అనిశ్చితి, డాలర్ విలువలో ఒడిదొడుకులు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ పెరగడం వంటివి ధరలు పెరగడానికి కారణాలు. అంతేకాదు, ద్రవ్యోల్బణం ఎక్కువైన సమయంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపడం వల్ల ధరలు మరింత పెరుగుతున్నాయి. రానున్న పండుగల సీజన్‌లో భారత్‌లో బంగారం డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.