BusinessToday gold rate

Gold Rate:బంగారం కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే వేలల్లో డబ్బులు ఆదా చేసుకోవచ్చు!

Gold Rate in telugu :బంగారం కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకుంటే భారీగా బేరం ఆడి, వేలల్లో డబ్బులు ఆదా చేసుకోవచ్చు.. బంగారం కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. బంగారం కొనాలని అనుకొనే ప్రతి ఒక్కరూ ఇప్పుడు చెప్పే విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఎందుకంటే బనగరం కొనాలని సామాన్యునికి కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్టితిలో బంగారం కొనటం సామాన్యునికి కష్టమే. రోజు రోజుకి బంగారం ధరలు అలా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి తెలివిగా బంగారం ను కొనుగోలు చేయాలి.

బంగారంను పెట్టుబడిగా భావించటం వలన మనలో చాలా మంది బంగారంను కొనుగోలు చేస్తున్నారు.ఒక రకంగా చెప్పాలంటే బంగారంను ఒక ఆస్తిగా భావిస్తారు. అలాగే బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూసే వారు కూడా ఉన్నారు.కాబట్టి ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటించి బంగారం కొనే సమయంలో డబ్బును ఆదా చేసుకోండి.

గత ఏడాదితో పోలిస్తే బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు 75,000 నుంచి 80,000 రూపాయల మధ్య ఉండగా, ప్రస్తుతం ఇది రోజురోజుకూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

సెప్టెంబర్ 9, 2025న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1.12 లక్షల రూపాయలకు చేరుకుంది, ఇది ఆల్-టైమ్ రికార్డు. గత 12 రోజులుగా బంగారం ధర రోజుకు సుమారు 1,000 రూపాయల చొప్పున పెరుగుతూ ఈ స్థాయికి చేరింది. ఈ పెరిగిన ధరలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఆర్థిక భారంగా మారాయి.

భారతీయ సంప్రదాయంలో వివాహాలు, శుభకార్యాల్లో బంగారు ఆభరణాలు ధరించడం సాంప్రదాయంగా వస్తోంది. బంగారాన్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. ముఖ్యంగా వివాహాల్లో ఆడపిల్లకు పుట్టింటి నుంచి బంగారం ఆస్తిగా ఇవ్వడం ఆనవాయితీ. అయితే, ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఒక తులం (10 గ్రాములు) లక్ష రూపాయలు దాటుతోంది. ఉదాహరణకు, 10 గ్రాముల బంగారు గొలుసు కొనడానికి సుమారు 1.15 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది.
బంగారు ఆభరణాలు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ధరను తగ్గించుకోవచ్చు. ఈ క్రింది చిట్కాలను పాటించండి:

బిఐఎస్ హాల్‌మార్క్ తప్పనిసరి చెక్ చేయండి: బంగారు ఆభరణాలు కొనేటప్పుడు BIS హాల్‌మార్క్ ఉందని నిర్ధారించుకోండి. అర గ్రాము బంగారం ఆభరణంపై కూడా ఈ మార్క్ ఉంటుంది. వీలైతే, భూతద్దం ఉపయోగించి హాల్‌మార్క్‌ను పరిశీలించండి.

స్టోన్స్ ఉన్న ఆభరణాలపై జాగ్రత్త: ఆభరణాల్లో స్టోన్స్ ఉంటే, వాటిపై అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. వీలైనంతవరకు తక్కువ స్టోన్స్ ఉన్న ఆభరణాలను ఎంచుకోండి.

మేకింగ్ ఛార్జీలు మరియు వేస్టేజ్‌పై బేరం: సాధారణంగా బంగారు ఆభరణాలపై వేస్టేజ్ (2% నుంచి 5%) మరియు మేకింగ్ ఛార్జీలు (మజూరీ, 8% నుంచి 25%) వసూలు చేస్తారు. క్లిష్టమైన డిజైన్లకు మజూరీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఛార్జీలపై బేరం ఆడి ధర తగ్గించుకోవచ్చు.

వివిధ దుకాణాల్లో ధరలు పోల్చండి: 3-4 దుకాణాలకు వెళ్లి ధరలను పోల్చి, బేరం ఆడితే మంచి డీల్ పొందవచ్చు.

బిల్లు పరిశీలన: బిల్లులో మజూరీ, వేస్టేజ్, జీఎస్టీ వేర్వేరుగా రాసారో లేదో చెక్ చేయండి. పాత బంగారాన్ని మార్చుకుంటే, కొత్త ఆభరణంపై మాత్రమే మజూరీ వసూలు చేయమని కోరండి.

బిల్లు జాగ్రత్తగా భద్రపరచండి: భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వస్తే బిల్లు ఉపయోగపడుతుంది, కాబట్టి దాన్ని సురక్షితంగా దాచుకోండి.

ఈ చిట్కాలతో బంగారు ఆభరణాల కొనుగోలులో జాగ్రత్తగా బేరం ఆడి, గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు! Gold News in Telugu /Business news in telugu

డిస్‌క్లైమర్: ఈ కథనం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. దీనిని పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించకూడదు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం వంటి పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే పెట్టుబడులు లేదా వ్యాపార నిర్ణయాలకు సంబంధించి chaipakodi ఎలాంటి బాధ్యత వహించదు. డబ్బు, పెట్టుబడి, వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించాలని chaipakodi సూచిస్తోంది.