Stock market today: సెప్టెంబర్ 10 వ తేదీ బుదవారం స్టాక్ మార్కెట్లో ఒక లుక్ వేయాల్సిన షేర్స్
Stock market today: సెప్టెంబర్ 10 వ తేదీ బుదవారం స్టాక్ మార్కెట్లో ఒక లుక్ వేయాల్సిన షేర్స్.. ట్రేడర్స్ ఈరోజు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్టును నిపుణులు ప్రకటించారు. ఇందులో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఇంకా లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
స్టాక్ మార్కెట్ అప్డేట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 314 పాయింట్లు పెరిగి 81,101 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50 95 పాయింట్లు పెరిగి 24,869 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 54,216 వద్దకు చేరింది.
ఎఫ్‌ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం సెషన్‌లో ఎఫ్‌ఐఐలు రూ.2,041.95 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ.176.35 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.
“నిఫ్టీ50లో ట్రెండ్ పాజిటివ్‌గా కొనసాగుతోంది. 24,900-25,000 లెవల్స్ కీలక రెసిస్టెన్స్‌గా ఉన్నాయి. సపోర్ట్ 24,750 వద్ద ఉంది,” అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్‌ను లాభాలతో ప్రారంభించే సూచనలు ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ సుమారు 55 పాయింట్ల లాభంలో ఉండటం దీనికి కారణం.

అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం సెషన్‌లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. డౌ జోన్స్ 0.43% పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.27% వృద్ధి చూసింది. నాస్‌డాక్ 0.37% పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్‌లో స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
కమిన్స్ ఇండియా – బై రూ.4012, స్టాప్ లాస్ రూ.3870, టార్గెట్ రూ.4292
రామ్ రత్న వైర్స్ – బై రూ.759.5, స్టాప్ లాస్ రూ.733, టార్గెట్ రూ.812
పిడిలైట్ ఇండస్ట్రీస్ – బై రూ.3098, స్టాప్ లాస్ రూ.3050, టార్గెట్ రూ.3154
టాటా పవర్ – బై రూ.384, స్టాప్ లాస్ రూ.378, టార్గెట్ రూ.394
రెడింగ్‌టన్ – బై రూ.243, స్టాప్ లాస్ రూ.235, టార్గెట్ రూ.255
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
అసాహి ఇండియా గ్లాస్: రూ.875 వద్ద కొనండి, టార్గెట్ రూ.940, స్టాప్ లాస్ రూ.845
అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్: రూ.115.85 వద్ద కొనండి, టార్గెట్ రూ.125, స్టాప్ లాస్ రూ.112
అఫిల్ 3ఐ: రూ.2070 వద్ద కొనండి, టార్గెట్ రూ.2222, స్టాప్ లాస్ రూ.2000
కోవై మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్: రూ.6350 వద్ద కొనండి, టార్గెట్ రూ.6800, స్టాప్ లాస్ రూ.6140
టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్: రూ.307.95 వద్ద కొనండి, టార్గెట్ రూ.330, స్టాప్ లాస్ రూ.297
(గమనిక: ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. chaipakodi కి ఎలాంటి సంబంధం లేదు. ట్రేడర్లు ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు స్వంత ఎనాలసిస్ చేసుకోవడం మంచిది.)

