DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope:సెప్టెంబర్ 11 రాశి ఫలాలు.. ఈ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త..

Today Horoscope:సెప్టెంబర్ 11 రాశి ఫలాలు.. ఈ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త.. 11 సెప్టెంబర్ 2025 – గురువారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, భాద్రపద మాసం. తిథి: చవితి మధ్యాహ్నం 12:46 వరకు, తరువాత పంచమి. నక్షత్రం: అశ్విని మధ్యాహ్నం 1:58 వరకు, తరువాత భరణి. వర్జ్యం: రాత్రి 10:46 నుండి 12:14 వరకు.

దుర్ముహూర్తం: మధ్యాహ్నం 3:03 నుండి 3:51 వరకు. రాహుకాలం: మధ్యాహ్నం 1:44 నుండి 3:15 వరకు. గుళికా కాలం: ఉదయం 9:09 నుండి 10:41 వరకు. బ్రహ్మ ముహూర్తం: తెల్లవారుజామున 4:31 నుండి 5:18 వరకు. అమృత ఘడియలు: ఉదయం 7:23 నుండి 8:50 వరకు.
చాంద్రమానం ప్రకారం మేషం నుండి మీనం వరకు ఈ రోజు దిన ఫలితాలు ఇలా ఉన్నాయి:

మేషం:
ఈ రోజు చంద్రబలం అనుకూలంగా ఉంది. సంతోషకరమైన రోజు. కొత్త లక్ష్యాలను నిర్ణయించుకోవడానికి అనువైన సమయం. వ్యాపారులకు ఉత్సాహకరమైన రోజు. సహాయం చేసినవారిని గుర్తుంచుకోండి. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. విద్యార్థులకు శుభ సమయం. గణేశుడికి కొబ్బరికాయ, బెల్లం సమర్పించండి, విఘ్నాలు తొలగుతాయి.
లక్కీ కలర్: పచ్చ
లక్కీ నెంబర్: 1

వృషభం:
గ్రహబలం కొంచెం తక్కువగా ఉంది. పనులు కొంత ఆలస్యంగా సాగవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. తూర్పు దిశ ప్రయాణాలు లాభిస్తాయి. డబ్బు సమయానికి అందుతుంది. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. ఖర్చుల్లో జాగ్రత్త. అమ్మవారి ఆరాధన ఇబ్బందులను తొలగిస్తుంది.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 6

మిథునం:
గ్రహబలం సామాన్యంగా ఉంది. పాత జ్ఞాపకాలు ఇబ్బంది కలిగించవచ్చు. వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. మానసిక ఆందోళన ఉండవచ్చు. వ్యాపారులకు రోజు ప్రారంభం నీరసంగా ఉన్నా, మధ్యాహ్నం నుండి అనుకూలత కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విష్ణు సహస్రనామం పఠిస్తే ఇబ్బందులు తగ్గుతాయి.
లక్కీ కలర్: గంధం రంగు
లక్కీ నెంబర్: 6

కర్కాటకం:
గ్రహబలం అనుకూలంగా ఉంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోష సమయం గడుపుతారు. ఖర్చులపై జాగ్రత్త అవసరం. విలాసవంతమైన వస్తువులపై డబ్బు వృథా చేయవద్దు. బ్రాహ్మణుల ఆశీర్వాదాలు లభిస్తాయి. వినాయకుడిని పూజించి, బ్రాహ్మణులకు దానం చేయండి, చిక్కులు తొలగుతాయి.
లక్కీ కలర్: నీలం, పసుపు
లక్కీ నెంబర్: 3

సింహం:
గ్రహబలం పూర్తిగా అనుకూలం కాదు. మాటల్లో నియంత్రణ పాటించండి. వ్యాపారంలో మెలకువ అవసరం. భాగస్వాములతో సమస్యలు రావచ్చు. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో జాగ్రత్త. వేంకటేశ్వరస్వామి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది.
లక్కీ కలర్: గులాబీ
లక్కీ నెంబర్: 9

కన్య:
గ్రహబలం అద్భుతంగా ఉంది. చిన్న వాగ్వివాదాల నుండి జాగ్రత్తగా ఉండండి. కెరీర్‌లో ఎదుగుదలకు సమయం దగ్గరపడింది. అధికారుల అనుగ్రహం లభిస్తుంది. పనులు సులభంగా సాగుతాయి. శుభవార్త వినే అవకాశం ఉంది. బంగారం, వాహనాల కొనుగోలుకు అనుకూల సమయం. కనకధారా స్తోత్రం పఠించండి.
లక్కీ కలర్: బంగారు రంగు
లక్కీ నెంబర్: 1

తుల:
గ్రహబలం పాక్షికంగా ఉంది. శుక్ర గ్రహం అనుకూలత వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలం. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. హామీలు ఇవ్వకండి. స్పెక్యులేషన్‌లు ఫలించవు. రాహుకాలంలో అమ్మవారిని ప్రార్థించండి, అనుకూల ఫలితాలు లభిస్తాయి.
లక్కీ కలర్: లేత ఎరుపు
లక్కీ నెంబర్: 5

వృశ్చికం:
గ్రహబలం చాలా బాగుంది. మనోవాంఛలు నెరవేరే రోజు. దక్షిణ దిశ ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారులకు ధనలాభం ఖాయం. వృత్తి నిపుణులకు అనుకూల సమయం. జీవిత భాగస్వామితో సంతోషకరమైన రోజు. సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం పఠిస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయి.
లక్కీ కలర్: గచ్చకాయ రంగు
లక్కీ నెంబర్: 9

ధనుస్సు:
గ్రహబలం పాక్షికంగా ఉంది. అపార్థాలకు దూరంగా ఉండండి. మాటల వల్ల దగ్గరివారు దూరమయ్యే అవకాశం ఉంది. భ్రమలకు లోనవ్వొద్దు. మానసిక ఆందోళన ఉండవచ్చు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. శివ ఆరాధన చేయండి, మంచి ఫలితాలు కనిపిస్తాయి.
లక్కీ కలర్: నీలం
లక్కీ నెంబర్: 5

మకరం:
గ్రహబలం పాక్షికంగా ఉంది. శని వక్రదృష్టి ప్రభావం ఇంకా పూర్తిగా తొలగలేదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అకాల భోజనం మానుకోండి. వాగ్వివాదాలకు వెళ్లవద్దు. అనవసర నిందలు రావచ్చు. విద్యార్థులు శ్రద్ధగా ఉండండి. మిత్రులతో దూరం పెరగవచ్చు. డబ్బు విషయంలో ఇబ్బందులు. ఈశ్వర ఆరాధన శుభం కలిగిస్తుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 3

కుంభం:
అనుకూలత కొంచెం తక్కువగా ఉంది. ఉద్యోగులు పని ప్రదేశంలో వాగ్వివాదాలకు గురయ్యే అవకాశం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. దూర ప్రయాణాలకు అనుకూలం కాదు. వ్యాపారులకు డబ్బు ఇబ్బందులు. గతంలో చేసిన పనులు వెంటాడవచ్చు. ధైర్యంగా ఉండండి. శ్రీ ముక్కంటి దర్శనం చిక్కులను తొలగిస్తుంది.
లక్కీ కలర్: మయూర నీలం
లక్కీ నెంబర్: 3

మీనం:
అద్భుతమైన రోజు. తలచిన పనులు నెరవేరుతాయి. కొత్త ఆస్తుల కొనుగోలు నిర్ణయాలకు అనుకూలం. వ్యాపారులకు ధనలాభం. కొత్త అవకాశాలు సులభంగా లభిస్తాయి. విద్యార్థులకు శుభ సమయం.
లక్కీ కలర్: లేత పచ్చ
లక్కీ నెంబర్: 3

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.