Stock market today: సెప్టెంబర్ 11 వ తేదీ గురువారం స్టాక్ మార్కెట్లో ఒక లుక్ వేయాల్సిన షేర్స్..
Stock market today: సెప్టెంబర్ 11 వ తేదీ గురువారం స్టాక్ మార్కెట్లో ఒక లుక్ వేయాల్సిన షేర్స్.. ట్రేడర్లు ఈరోజు ట్రాక్ చేయాల్సిన స్టాక్‌ల బై లిస్టును నిపుణులు వెల్లడించారు. ఇందులో బ్రేకౌట్ స్టాక్‌లు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా, తాజా స్టాక్ మార్కెట్ అప్డేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
స్టాక్ మార్కెట్ అప్డేట్లు…
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ను దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 324 పాయింట్లు పెరిగి 81,425 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50 104 పాయింట్లు పెరిగి 24,973 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 320 పాయింట్లు పెరిగి 54,536 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు మరియు డీఐఐలు…
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 33.55 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదే సమయంలో, డీఐఐలు రూ. 4,963.53 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ సుమారు 20 పాయింట్ల లాభంలో ఉండటమే ఇందుకు కారణం.
“నిఫ్టీ50 25,200 నుంచి 25,500 వరకు వెళ్లే సాధ్యత ఉంది. 24,800 వద్ద సపోర్ట్ ఉంది,” అని ఈక్విటీ రీసెర్చ్ హెడ్, టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్ అనలిస్ట్ నీలేశ్ జైన్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు…
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ను అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగించాయి. డౌ జోన్స్ 0.48 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.30 శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.03 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.
స్టాక్‌లు టు బై…
వారీ ఎనర్జీస్ – బై రూ. 3646, స్టాప్ లాస్ రూ. 3333, టార్గెట్ రూ. 3700
ఇంద్రప్రస్త మెడికల్ కార్పొరేషన్ – బై రూ. 507.5, స్టాప్ లాస్ రూ. 488, టార్గెట్ రూ. 545
ఐటీసీ – బై రూ. 413, స్టాప్ లాస్ రూ. 400, టార్గెట్ రూ. 430
ఏషియన్ పెయింట్స్ – బై రూ. 2543, స్టాప్ లాస్ రూ. 2480, టార్గెట్ రూ. 2650
పీఎన్బీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ – బై రూ. 810, స్టాప్ లాస్ రూ. 790, టార్గెట్ రూ. 850
బ్రేకౌట్ స్టాక్‌లు టు బై…
భారత్ సీట్స్: బై రూ. 168.8, టార్గెట్ రూ. 180, స్టాప్ లాస్ రూ. 163
పెర్ల్ గ్లోబల్ ఇండస్ట్రీస్: బై రూ. 1400, టార్గెట్ రూ. 1500, స్టాప్ లాస్ రూ. 1350
ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్: బై రూ. 220.4, టార్గెట్ రూ. 237, స్టాప్ లాస్ రూ. 211
కింగ్ఫా సైన్స్ అండ్ టెక్నాలజీ (ఇండియా): బై రూ. 4507, టార్గెట్ రూ. 4848, స్టాప్ లాస్ రూ. 4350
ఎల్టీ ఫుడ్స్: బై రూ. 453, టార్గెట్ రూ. 488, స్టాప్ లాస్ రూ. 436
(గమనిక: ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. chaipakodiకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లు సొంతంగా అనాలిసిస్ చేసుకోవడం మంచిది.)

