Beauty Tips

White Hair:ఇలా కనుక వాడితే తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు ఒత్తుగా పెరుగుతుంది

White HAir Tips:చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తమ జుట్టు అందంగా, నల్లగా, ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు. అయితే, ఈ రోజుల్లో యువత ఎదుర్కొంటున్న ఒత్తిడి, నైట్ షిఫ్ట్ డ్యూటీలు, జీవనశైలి మార్పులు వంటి కారణాల వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోంది. దీనికి తోడు జంక్ ఫుడ్ తీసుకోవడం, కెమికల్ ఆధారిత షాంపూలు, క్రీమ్‌లు, జెల్‌ల వాడకం వల్ల జుట్టు తన సహజ నలుపు రంగును కోల్పోతోంది.

ఈ సమస్యల నుంచి బయటపడడానికి చాలామంది ఖరీదైన షాంపూలు, బ్యూటీ పార్లర్‌లకు వెళ్లి డబ్బు ఖర్చు చేస్తున్నారు. కానీ, ఫలితం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. అందుకే, ఆయుర్వేద నిపుణులు ఇంట్లోనే సహజమైన చిట్కాలతో జుట్టును నల్లగా, ఆరోగ్యంగా, అందంగా మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. ఇప్పుడు కొన్ని బ్యూటీ టిప్స్ తెలుసుకుందాం.

ఫ్యాషన్ పేరుతో జుట్టుకు ఎన్ని రంగులు వేసినా, నలుపు రంగు ఎప్పటికీ అందమైనదిగా ఉంటుంది. అయితే, మారిన జీవనశైలి, పోషకాహార లోపం, ఒత్తిడి వంటి కారణాల వల్ల చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య తలెత్తుతోంది. కొందరిలో ఇది వంశపారంపర్యంగా వస్తే, మరికొందరిలో ఆహారపు అలవాట్లు, కెమికల్ ఉత్పత్తుల వాడకం వల్ల సంభవిస్తుంది. ఈ సమస్యలను అధిగమించడానికి ఖరీదైన బ్యూటీ సెలూన్‌లకు వెళ్లకుండా, ఇంట్లోనే సులభమైన చిట్కాలతో జుట్టును నల్లగా, ఒత్తుగా, ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.

ఆయుర్వేద చిట్కాలు:
అశ్వగంధ:
ఆయుర్వేదంలో జుట్టు పెరుగుదలకు అశ్వగంధ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆయుర్వేద షాపుల్లో అశ్వగంధ పొడి సులభంగా లభిస్తుంది. ఒక గిన్నెలో కొబ్బరి నూనెలో అశ్వగంధ పొడిని కలిపి, ఆ మిశ్రమాన్ని 10 నిమిషాలు నానబెట్టి, జుట్టు మరియు తలకు రాయాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, ముదురు రంగులో, పొడవుగా పెరుగుతుంది.

వేడి నూనె మసాజ్:
జుట్టుకు నూనె రాయకపోతే, కొంతకాలానికి జుట్టు గోధుమ రంగులోకి మారుతుంది. అందుకే, కొబ్బరి నూనె, ఆముదం, లేదా ఆల్మండ్ నూనె వంటివి క్రమం తప్పకుండా రాయడం చాలా ముఖ్యం. వారానికి రెండుసార్లు నూనెను గోరువెచ్చగా వేడి చేసి, తలకు రాసి మసాజ్ చేయాలి. ఈ పద్ధతి జుట్టును ఆరోగ్యంగా, నల్లగా ఉంచుతుంది.

కరివేపాకు నూనె:
కరివేపాకు జుట్టును నల్లగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కరివేపాకును రెండు రోజులు ఎండలో ఆరబెట్టి, పొడి చేయాలి. ఈ పొడిని ఒక టీస్పూన్ చొప్పున కొబ్బరి నూనెలో కలిపి, 10 నిమిషాలు తలకు మసాజ్ చేయాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే, వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ చిట్కా పాటించడం వల్ల జుట్టు నల్లగా, ఆకర్షణీయంగా మారుతుంది. కరివేపాకు పొడిని నూనెలో మరిగించి నిల్వ చేసుకోవచ్చు. కరివేపాకును మనం రెగ్యలర్ గా వాడుతూనే ఉంటాం.

మందార నూనె:
తెల్ల జుట్టును ముదురు రంగులోకి మార్చడానికి మందార పుష్పాలు బాగా ఉపయోగపడతాయి. మందార పువ్వులను వేడి నూనెలో గంటసేపు నానబెట్టి, ఆ నూనెను జుట్టుకు రాయాలి. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా చేస్తే, తెల్ల జుట్టు క్రమంగా ముదురు రంగులోకి మారుతుంది. మందార పువ్వులు సులభంగానే దొరుకుతాయి.

అదనపు జాగ్రత్తలు:
ఎండలో బయటికి వెళ్లేటప్పుడు జుట్టును స్కార్ఫ్ లేదా టోపీతో కప్పుకోవడం మంచిది. సూర్యరశ్మి నేరుగా జుట్టుకు తగిలితే రంగు మారే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.ఈ సహజ చిట్కాలతో ఇంట్లోనే జుట్టును నల్లగా, ఆరోగ్యంగా, అందంగా మార్చుకోవచ్చు.

ఇప్పుడు చెప్పిన అన్ని చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. మార్కెట్ లో దొరికే ఉత్పత్తులను వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాస్త సమయాన్ని కేటాయిస్తే చాలా తక్కువ ఖర్చుతో జుట్టు సమస్యల నుండి బయట పడవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.