DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope:సెప్టెంబర్ 12 రాశి ఫలాలు… ఈ రాశి వారికీ అనుకోని అదృష్టం..

Today Horoscope:సెప్టెంబర్ 12 రాశి ఫలాలు… ఈ రాశి వారికీ అనుకోని అదృష్టం.. మనలో చాలా మంది ప్రతి రోజు రాశి ఫలాలను చూసుకుంటూ ఉంటారు. అలా చూస్కొని దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తూ ఉంటారు.

12 సెప్టెంబర్ 2025 – శుక్రవారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

తిథి: పంచమి ఉదయం 10:00 వరకు, తరువాత షష్ఠి
నక్షత్రం: భరణి ఉదయం 11:59 వరకు, తరువాత కృత్తిక
వర్జ్యం: రాత్రి 11:04 నుండి 12:33 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 8:33 నుండి 9:22 వరకు, మధ్యాహ్నం 12:36 నుండి 1:25 వరకు
రాహుకాలం: ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:12 వరకు
గుళికాకాలం: ఉదయం 7:38 నుండి 9:09 వరకు
బ్రహ్మముహూర్తం: తెల్లవారుజామున 4:31 నుండి 5:19 వరకు
అమృత ఘడియలు: ఉదయం 7:03 నుండి 8:29 వరకు

మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల దిన ఫలాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

మేషం:
ఈ రోజు గ్రహబలం మీకు అత్యంత అనుకూలంగా ఉంది. మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభదాయకమైన రోజు, డబ్బుకు ఇబ్బంది ఉండదు. కాంట్రాక్టర్లు, వ్యాపారులకు కొత్త ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. ఉదయం తలస్నానం చేసి, కనకధారా స్తోత్రం పఠించండి. అమ్మవారికి పచ్చి శనగలు నైవేద్యంగా సమర్పించండి, ధనలాభం పొందుతారు.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 5

వృషభం:
గ్రహబలం మీకు అనుకూలంగా ఉంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అనుకోని మార్గాల నుండి పెద్ద మొత్తంలో డబ్బు అందే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొంత అనుకూలత తక్కువగా ఉండవచ్చు, పని స్థలంలో చిన్న వివాదాలు రావచ్చు, జాగ్రత్త వహించండి. శివుడి ఆరాధన చేయడం ద్వారా సమస్యలు తొలగుతాయి.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 5

మిథునం:
గ్రహబలం పాక్షికంగా అనుకూలంగా ఉంది. బుధుడి ప్రభావంతో వ్యాపారంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బు సమయానికి అందుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ రోజు అనుకూలం. ఖర్చులపై శ్రద్ధ వహించండి, విలాసవంతమైన ఖర్చులకు దూరంగా ఉండండి. స్పెక్యులేషన్లు ఫలించవు. మహాలక్ష్మి అమ్మవారికి చామంతి పూలతో పూజ చేయండి, అనుకోని ధనలాభం కలుగుతుంది.
లక్కీ కలర్: బంగారు రంగు
లక్కీ నెంబర్: 5

కర్కాటకం:
గ్రహబలం పాక్షికంగా అనుకూలంగా ఉంది. శని ప్రభావం వల్ల కొంత మానసిక ఒత్తిడి కనిపిస్తుంది. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. డబ్బు సర్దుబాటు అయినప్పటికీ, ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉంది, కానీ ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. గణపతి ఆరాధన చేయడం వల్ల అడ్డంకులు తొలగుతాయి.
లక్కీ కలర్: పచ్చ
లక్కీ నెంబర్: 3

సింహం:
సూర్యుడి అనుకూల దృష్టి వల్ల ఈ రోజు అనేక విషయాలు సానుకూలంగా సాగుతాయి. మీ మాటకు విలువ ఉంటుంది, రాజయోగం అనుభవిస్తారు. రాజకీయ నాయకులకు కొత్త పదవులు రావచ్చు. బంగారం, భూములపై పెట్టుబడులు చేయడానికి అనుకూలమైన రోజు. వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు శుభకరమైన రోజు. లక్ష్మీదేవికి పచ్చి శనగలు నైవేద్యంగా సమర్పించండి.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 3

కన్య:
బుధుడి అనుకూలత వల్ల వ్యాపార లావాదేవీలలో విజయం సాధిస్తారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు ఈ రోజు అనుకూలం. క్రియేటివ్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు శుభ ఫలితాలు ఉన్నాయి. కనకదుర్గ అమ్మవారికి ఎరుపు పూలతో అర్చన చేయించండి, అన్ని శుభాలు కలుగుతాయి.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 1

తుల:
చంద్ర, శుక్ర బలం వల్ల తలపెట్టిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. వ్యవహారాల్లో విజయం కనిపిస్తుంది. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి, మీ పనులే మీ గుర్తింపును తెస్తాయి. మిత్రులలో ఆకస్మిక మార్పులు ఇబ్బంది కలిగించవచ్చు. భూములపై పెట్టుబడులకు అవకాశం ఉంది. లక్ష్మీ ఆరాధన, కనకధారా స్తోత్రం పఠనం శుభ ఫలితాలనిస్తాయి.
లక్కీ కలర్: ఆకుపచ్చ
లక్కీ నెంబర్: 3

వృశ్చికం:
గ్రహబలం పూర్తిగా అనుకూలంగా లేదు. కుజుడి ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. వ్యాపారులకు పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. ఉద్యోగులు పై అధికారుల ఒత్తిడిని ఎదుర్కొంటారు. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అమ్మవారి ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: లేత ఎరుపు
లక్కీ నెంబర్: 9

ధనుస్సు:
గ్రహబలం అత్యంత అనుకూలంగా ఉంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు, బంధుమిత్రులతో వినోదాలు ఉంటాయి. ప్రియమైన వారితో సంభాషణలు సంతోషాన్నిస్తాయి. పాత అపార్థాలు తొలగిపోతాయి. ఆర్థికంగా లాభదాయకమైన రోజు, కొత్త పెట్టుబడులు ఫలిస్తాయి. విద్యారంగంలో పనిచేసేవారికి అనుకూలం. లక్ష్మీదేవికి పసుపు రంగు పూలు, పచ్చి శనగలు సమర్పించండి.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 9

మకరం:
గ్రహబలం పాక్షికంగా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా లాభదాయకం, పెట్టుబడులకు మంచి సమయం. మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. వ్యాపారులకు ధనలాభం కనిపిస్తుంది. జీవిత భాగస్వామికి కానుకలు కొనే అవకాశం. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలత ఉంది. తూర్పు దిశ ప్రయాణాలు లాభిస్తాయి. విష్ణు సహస్రనామం పఠించండి.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 3

కుంభం:
గ్రహబలం అనుకూలంగా ఉంది. చాలా రోజుల తర్వాత పనులు సజావుగా సాగుతాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు ధనలాభం కనిపిస్తుంది. మిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. శివ ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: నీలం
లక్కీ నెంబర్: 7

మీనం:
గ్రహబలం పూర్తిగా అనుకూలంగా లేదు. గురు బలం తక్కువ కావడం వల్ల పనులు ఆశించిన విధంగా సాగవు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. మాటలు ఆచితూచి మాట్లాడండి. వ్యాపారులు, ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. రియల్ ఎస్టేట్ ఒప్పందాలకు ఈ రోజు అనుకూలం కాదు. ఆరోగ్యం, వాహన డ్రైవింగ్‌లో జాగ్రత్త అవసరం. విష్ణుమూర్తి ఆరాధన సమస్యలను తొలగిస్తుంది.
లక్కీ కలర్: లేత గంధం రంగు
లక్కీ నెంబర్: 3

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ