BusinessToday gold rate

Gold Rate:తులం బంగారం ధర రూ.10,000 తగ్గే అవకాశం… కారణం తెలిస్తే ఆనందిస్తారు!

Gold Rate:తులం బంగారం ధర రూ.10,000 తగ్గే అవకాశం… కారణం తెలిస్తే ఆనందిస్తారు.. బంగారం ధరలు డాలర్ విలువతో పోటీపడుతున్నాయి. గత కొన్ని వారాలుగా డాలర్ విలువ తగ్గుముఖం పట్టినట్లు గమనించవచ్చు. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం ధర పెరుగుతుంది, అదే డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గే అవకాశం ఉంది.

బంగారం ధరలు ఇప్పటికే చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయికి చేరాయి. గత రెండు వారాల్లో రోజుకు రూ.1,000 చొప్పున పెరిగి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.12 లక్షలకు చేరుకుంది. ఈ స్థాయి ధర గతంలో ఎన్నడూ లేదు. దీంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం సామాన్యులకు కష్టసాధ్యంగా మారింది.

ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అస్థిర పరిస్థితులే. ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లిస్తున్నారు, దీంతో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

ప్రస్తుతం బంగారం స్పాట్ ధర ఒక ఔన్స్‌కు 3,634.96 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక దశలో ఇది 3,700 డాలర్ల వద్ద ఆల్-టైమ్ రికార్డును తాకింది. ఇటీవల అమెరికాలో విడుదలైన జాబ్స్ డేటా ప్రకారం, ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య (జాబ్‌లెస్ క్లెయిమ్స్) మూడేళ్ల గరిష్ఠ స్థాయి 2.63 లక్షలకు చేరింది. ఈ నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ డాలర్ విలువ పెరిగితే, బంగారం ధర తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం బంగారం ధర ఓవర్‌బాట్ పొజిషన్‌లో ఉంది. నిపుణుల అంచనా ప్రకారం, ప్రస్తుత ధర నుంచి బంగారం ధర 10% వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే, తులం బంగారం ధర దాదాపు రూ.10,000 వరకు తగ్గొచ్చు.

డిస్‌క్లైమర్: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే. దీనిని పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించరాదు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం వంటి పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోబడి ఉంటాయి. మీ పెట్టుబడులు, వ్యాపార నిర్ణయాల వల్ల జరిగే లాభనష్టాలకు chaipakodi బాధ్యత వహించదు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించాలని chaipakodi సూచిస్తుంది.