DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope:సెప్టెంబర్ 16 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ ఆకస్మిక ధన లాభం..

Today Horoscope:సెప్టెంబర్ 16 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ ఆకస్మిక ధన లాభం.. ఈ మధ్య కాలంలో జాతకాలను నమ్మే వారు చాలా ఎక్కువ అయ్యారు. ప్రతి రోజు రాశి ఫలాలను చూస్కొని అడుగు ముందుకు వేస్తున్నారు. అయితే కొంత మంది అసలు జాతకాలను అసలు నమ్మరు. ఇక ఈ రాజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

16 సెప్టెంబర్ 2025 – మంగళవారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం – భాద్రపద మాసం
తిథి: దశమి (రాత్రి 12:24 వరకు, తరువాత ఏకాదశి)
నక్షత్రం: ఆరుద్ర (ఉదయం 6:44 వరకు, తరువాత పునర్వసు)
వర్జ్యం: సాయంత్రం 6:36 నుండి రాత్రి 8:11 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 8:33 నుండి 9:21 వరకు, రాత్రి 10:59 నుండి 11:47 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:43 వరకు
బ్రహ్మముహూర్తం: తెల్లవారుజాము 4:31 నుండి 5:19 వరకు
అమృత ఘడియలు: తెల్లవారుజాము 4:03 నుండి 5:37 వరకు
(నోట్: “+” అనగా మరుసటి రోజు)
చాంద్రమానం ఆధారంగా మేషం నుండి మీనం వరకు ఈ రోజు రాశిఫలాలు ఈ విధంగా ఉన్నాయి:

మేషరాశి:
ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లింపబడతాయి. వ్యాపారస్తులకు రోజు ఉత్సాహంగా ప్రారంభమై, ఆర్థిక లాభాలు అందుతాయి. అమ్మవారి దర్శనం చేస్తే శుభఫలితాలు కలుగుతాయి.
అనుకూల రంగు: ఎరుపు
అనుకూల సంఖ్య: 9

వృషభరాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలమైన సమయం. కొత్త పెట్టుబడులకు సమయం బాగుంది. శుభవార్త వింటారు. ఉద్యోగ, వృత్తి రంగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విష్ణు సహస్రనామం పఠిస్తే విజయం సిద్ధిస్తుంది.
అనుకూల రంగు: పసుపు
అనుకూల సంఖ్య: 5

మిథునరాశి:
ఈ రోజు గ్రహబలం అనుకూలంగా లేదు. పనుల్లో ఆలస్యం జరుగుతుంది. వ్యాపారస్తులకు ఆర్థిక నష్టాలు రావచ్చు, కాబట్టి జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అసౌకర్యమైన వాతావరణం, పని ఒత్తిడి లేదా అధికారుల ఆగ్రహం ఎదురయ్యే అవకాశం ఉంది. శివారాధన శుభఫలితాలను ఇస్తుంది.
అనుకూల రంగు: లేత వంగపండు రంగు
అనుకూల సంఖ్య: 6

కర్కాటకరాశి:
గ్రహబలం పాక్షికంగా అనుకూలంగా ఉంది. అనుకోని ధనలాభం, అలాగే ఖర్చులు కూడా ఉంటాయి. వ్యవహారాల్లో విజయం సాధ్యం. నిరుద్యోగులకు శుభవార్తలు వినే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. గణపతి ఆరాధన శుభఫలితాలను అందిస్తుంది.
అనుకూల రంగు: పచ్చ
అనుకూల సంఖ్య: 5

సింహరాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. ఎప్పటినుండో ఉన్న సమస్య నుండి బయటపడతారు. కొత్త వాహన కొనుగోలుకు అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కనకధారా స్తోత్రం పఠిస్తే శుభం కలుగుతుంది.
అనుకూల రంగు: లేత పసుపు
అనుకూల సంఖ్య: 3

కన్యారాశి:
గ్రహబలం అనుకూలత తక్కువగా ఉంది. పనుల్లో అడ్డంకులు, అనుకోని సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలకు దూరంగా ఉండండి. దూర ప్రయాణాలు అంతగా అనుకూలం కాదు. ఖర్చులను నియంత్రించండి. పంచముఖీ ఆంజనేయస్వామి దర్శనం ఇబ్బందులను తగ్గిస్తుంది.
అనుకూల రంగు: కాషాయం
అనుకూల సంఖ్య: 6

తులారాశి:
గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారస్తులకు ఆర్థిక విషయాల్లో లాభం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూముల క్రయవిక్రయాలు శుభప్రదంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకూలమైన రోజు.
అనుకూల రంగు: కనకాంబరం రంగు
అనుకూల సంఖ్య: 5

వృశ్చికరాశి:
గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిడి ఎదురవుతుంది. పనుల్లో విపరీతమైన కష్టం కనిపిస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం, అప్పులు చేయవద్దు. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. శివారాధన సమస్యలను తొలగిస్తుంది.
అనుకూల రంగు: ముదురు నీలం
అనుకూల సంఖ్య: 9

ధనూరాశి:
గ్రహబలం అద్భుతంగా ఉంది. చేపట్టిన పనుల్లో విజయం సాధ్యం. ఆర్థికంగా అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకు రోజు ప్రారంభం నుండి శుభకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అమ్మవారి ఆరాధన శుభఫలితాలను ఇస్తుంది.
అనుకూల రంగు: లేత పసుపు
అనుకూల సంఖ్య: 6

మకరరాశి:
గ్రహబలం అనుకూలంగా ఉండటంతో తలపెట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగస్తులకు పనిలో ప్రశంసలు అందుతాయి. కొత్త గృహ కొనుగోలుకు అనుకూల సమయం. బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు శుభకరమైన రోజు.
అనుకూల రంగు: పాలపిట్ట రంగు
అనుకూల సంఖ్య: 11

కుంభరాశి:
గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు. అప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఋణదాతల నుండి ఒత్తిడి ఎదురవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. వ్యాపార, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ ఇనుము, నూనె, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టండి. శివారాధన సమస్యలను తొలగిస్తుంది.
అనుకూల రంగు: ముదురు నీలం
అనుకూల సంఖ్య: 11

మీనరాశి:
గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం భూమి క్రయవిక్రయాలు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పఠిస్తే సమస్యలు తొలగుతాయి.
అనుకూల రంగు: పసుపు
అనుకూల సంఖ్య: 9

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.