Business

UPI Limit: యూపీఐ లావాదేవీల పరిమితి పెంపు: రోజుకు రూ.10 లక్షల వరకు – పూర్తి వివరాలు!

UPI: యూపీఐ లావాదేవీల పరిమితి పెంపు: రోజుకు రూ.10 లక్షల వరకు – పూర్తి వివరాలు.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పెద్ద మొత్తంలో యూపీఐ లావాదేవీలు చేసే వారికి శుభవార్త అందించింది. రోజువారీ లావాదేవీల పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన కొన్ని రకాల లావాదేవీల కోసం గరిష్ట పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది.

కీలక మార్పులు:
పర్సన్ టు మర్చంట్ (P2M) లావాదేవీలు: పెట్టుబడులు, ఇన్సూరెన్స్, ట్రావెల్ బుకింగ్‌లు, క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లింపులు, ఆభరణాల కొనుగోళ్ల కోసం రోజుకు రూ.10 లక్షల వరకు లావాదేవీలు చేయవచ్చు.
మోసాల నియంత్రణ: మోసాలను అరికట్టేందుకు పర్సన్ టు పర్సన్ (P2P) “కలెక్ట్ రిక్వెస్ట్” ఫీచర్‌ను NPCI తొలగించింది.
క్యాపిటల్ మార్కెట్ & ఇన్సూరెన్స్: గతంలో రూ.2 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు, రోజువారీ గరిష్ట పరిమితి రూ.10 లక్షలు.
గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్, ట్రావెల్, లోన్ రీపేమెంట్, ఈఎమ్ఐ: ఈ లావాదేవీలకు కూడా రూ.10 లక్షల వరకు పరిమితి వర్తిస్తుంది.
క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లింపులు: ఒక్కో లావాదేవీకి రూ.5 లక్షలు, రోజుకు గరిష్టంగా రూ.6 లక్షల వరకు.
బంగారు ఆభరణాల కొనుగోలు: ఒక్కో లావాదేవీకి రూ.2 లక్షలు, రోజుకు గరిష్టంగా రూ.6 లక్షలు.
వైద్యం & విద్య: ఈ రంగాలకు సంబంధించిన లావాదేవీలకు రూ.10 లక్షల వరకు పరిమితి.
ఇన్వెస్ట్‌మెంట్ & గవర్నమెంట్ సెక్యూరిటీస్: ఈ లావాదేవీలకు కూడా రూ.10 లక్షల పరిమితి వర్తిస్తుంది.

పర్సన్ టు పర్సన్ (P2P) లావాదేవీలు:
P2P లావాదేవీలకు ఎలాంటి మార్పులు లేవు. రోజువారీ పరిమితి రూ.1 లక్షగా కొనసాగుతుంది.
ఈ కొత్త లిమిట్‌లు వెరిఫైడ్ మర్చంట్‌లకు మాత్రమే వర్తిస్తాయి.

ఈ మార్పులతో యూపీఐ వినియోగదారులకు పెద్ద మొత్తంలో లావాదేవీలు సులభతరం కానున్నాయి. NPCI ఈ నిర్ణయాల ద్వారా డిజిటల్ చెల్లింపులను మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.