Telugu Horoscope:సెప్టెంబర్ 17 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ పట్టిందల్లా బంగారమే..
Telugu Horoscope:సెప్టెంబర్ 17 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ పట్టిందల్లా బంగారమే.. 17 సెప్టెంబర్ 2025 – బుధవారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, భాద్రపద మాసం – తిథి ఏకాదశి రాత్రి 11:42 వరకు, ఆ తర్వాత ద్వాదశి – నక్షత్రం పునర్వసు ఉదయం 6:23 వరకు, ఆ తర్వాత పుష్యమి – వర్జ్యం మధ్యాహ్నం 2:28 నుండి సాయంత్రం 4:04 వరకు – దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:34 వరకు – రాహుకాలం మధ్యాహ్నం 12:10 నుండి మధ్యాహ్నం 1:41 వరకు – బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:19 వరకు – అమృత ఘడియలు రాత్రి 12:06 నుండి 1:42 వరకు (నోట్: “+” అనగా మరుసటి రోజు). ఈ రోజు మీ రాశికి గ్రహబలం, అనుకూలతలు, అలాగే వ్యతిరేక ఫలితాలను ఖచ్చితమైన లెక్కలతో అందిస్తున్నాము. మేషం నుండి మీనం వరకు ఈ రోజు రాశిఫలాలు మీ కోసం…
మేషరాశి:
ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది. మనసులోని కోరికలు నెరవేరే సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారులకు దీర్ఘకాలిక ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తుంది. బంగారు ఆభరణాల కొనుగోలుకు అనుకూల రోజు. విద్యార్థులకు, మహిళలకు శుభకరమైన సమయం. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శుభ ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 6
వృషభరాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. శుక్రుడి అనుగ్రహంతో సమాజంలో గౌరవం, మీ మాటకు విలువ పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వాహన కొనుగోలుకు అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించడం మంచిది.
లక్కీ కలర్: లేత గంధం
లక్కీ నెంబర్: 9
మిథునరాశి:
ఈ రోజు గ్రహబలం కొంత తక్కువగా ఉంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారులకు ఖర్చులు, ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగులకు పనిలో ఒత్తిడి, నిరుత్సాహం ఉండవచ్చు. అనవసర వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. విష్ణు సహస్రనామ జపం చేయడం అనుకూలం.
లక్కీ కలర్: పచ్చ
లక్కీ నెంబర్: 7
కర్కాటకరాశి:
చంద్రబలం చాలా తక్కువగా ఉంది. తలపెట్టిన పనులు ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు తలెత్తవచ్చు. విద్యార్థులు చదువులో శ్రద్ధ వహించాలి.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 6

సింహరాశి:
గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. సూర్యుడి అనుగ్రహంతో భారీ లాభాలు కనిపిస్తాయి. వ్యాపారులకు ఉత్సాహకరమైన రోజు. కుటుంబంతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అనుకూలమైన సమయం. సుందరకాండలో 5 శ్లోకాలు పఠించడం ద్వారా రోజును ప్రారంభిస్తే విజయం సిద్ధిస్తుంది.
లక్కీ కలర్: గులాబీ
లక్కీ నెంబర్: 9
కన్యారాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. గత కొన్ని రోజులుగా ఉన్న సమస్యలు తొలగుతాయి. వ్యాపారులకు లాభదాయక ఫలితాలు. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. అమ్మవారి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 9
తులారాశి:
గ్రహబలం కొంత తక్కువగా ఉంది. పనుల్లో చికాకులు, ఆలస్యం ఎదురవుతాయి. శుక్రుడి అనుకూలత తక్కువ కావడంతో మీ మాటకు విలువ తగ్గవచ్చు. రాజకీయ నాయకులు మాటల్లో నియంత్రణ పాటించాలి. వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూ క్రయవిక్రయాలు అనుకూలం. శివారాధన సమస్యలను తగ్గిస్తుంది.
లక్కీ కలర్: నీలం
లక్కీ నెంబర్: 9
వృశ్చికరాశి:
గ్రహబలం పాక్షికంగా అనుకూలం. వ్యాపారులకు రోజు ప్రారంభంలో అనుకూలత తక్కువగా ఉన్నా, ముగింపు లాభదాయకంగా ఉంటుంది. ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి, విలాసాలకు డబ్బు వృథా చేయవద్దు. విద్యార్థులు చదువులో శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ముక్కంటికి బిల్వపత్రాలతో పూజ చేయడం మంచిది.
లక్కీ కలర్: లేత నీలం
లక్కీ నెంబర్: 3
ధనూరాశి:
గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. భారీ ధనలాభం కలుగుతుంది. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. నూతన పెట్టుబడులు, భూ కొనుగోళ్లకు అనుకూల సమయం. గురుడి అనుగ్రహంతో ఉద్యోగులకు పదోన్నతులు, అధికారుల ప్రశంసలు లభిస్తాయి. విద్యార్థులకు కొత్త కోర్సులు, పోటీ పరీక్షలకు అనుకూలం. వేంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించడం శుభం.
లక్కీ కలర్: కనకాంబరం రంగు
లక్కీ నెంబర్: 9
మకరరాశి:
గ్రహబలం సాధారణంగా ఉంది. పనులు ఒత్తిడితో పూర్తవుతాయి. ఆర్థికంగా సమస్యలు లేవు, కానీ ఖర్చుల్లో నియంత్రణ అవసరం. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారులకు, ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శివ దర్శనం మానసిక శాంతిని ఇస్తుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 2
కుంభరాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. గత కొన్ని రోజులుగా ఇబ్బంది పెట్టిన సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబంతో సంతోషకరమైన సమయం గడుపుతారు. పిల్లల విజయాలు సంతోషాన్నిస్తాయి. వ్యాపారులకు ఉత్సాహకరమైన రోజు. ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అంజనేయ స్వామికి కొబ్బరికాయ, అరటిపళ్లు సమర్పించండి.
లక్కీ కలర్: కాషాయం
లక్కీ నెంబర్: 3
మీనరాశి:
గ్రహబలం సాధారణంగా ఉంది. గురుబలం కొంత తక్కువగా ఉంది. ఉద్యోగులకు అధికారుల నుండి పని గురించి ప్రశ్నలు ఎదురవుతాయి. వ్యాపారులకు ఆర్థిక సర్దుబాటులో ఇబ్బందులు కనిపిస్తాయి. పనిలో శ్రద్ధ పెట్టండి. డాక్యుమెంట్లపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పఠించడం అనుకూలతను పెంచుతుంది.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 5
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

