Today Horoscope:సెప్టెంబర్ 18 రాశి ఫలాలు.. ఈ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త..
Today Horoscope:సెప్టెంబర్ 18 రాశి ఫలాలు.. ఈ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త.. ఈ మధ్య కాలంలో జాతకాలను నమ్మే వారు చాలా ఎక్కువ మండే ఉన్నారు. అలాగే జాతకాలను నమ్మని వారు కూడా ఉన్నారు.
18 సెప్టెంబర్ 2025 – గురువారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం – భాద్రపద మాసం
తిథి: ద్వాదశి (రాత్రి 11:27 వరకు), తరువాత త్రయోదశి
నక్షత్రం: పుష్యమి (ఉదయం 6:29 వరకు), తరువాత ఆశ్లేష
వర్జ్యం: రాత్రి 7:38 నుండి 9:16 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 1:40 నుండి 3:11 వరకు
బ్రహ్మముహూర్తం: తెల్లవారుజామున 4:32 నుండి 5:20 వరకు
అమృత ఘడియలు: తెల్లవారుజామున 5:27 నుండి ఉదయం 7:05 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:34 వరకు
చాంద్రమానం ఆధారంగా ఈ రోజు 12 రాశులకు దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం:
మేషరాశి:
ఈ రోజు చంద్రబలం కొంచెం తక్కువగా ఉంది. పనులు ఆలస్యంగా ప్రారంభమవుతాయి. వ్యాపారులకు మధ్యాహ్నం తరువాత కొంత అనుకూలత కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు సమయానికి సర్దుబాటవుతాయి. విలాసాలకు దూరంగా ఉండండి. ప్రదర్శన ధోరణి మీకు అనుకూలం కాదు. సింధూరం నుదుటన ధరించి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. సమస్యలు తొలగిపోతాయి.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 9
వృషభరాశి:
ఈ రోజు చంద్రబలం అనుకూలంగా ఉంది. ఆస్తులు కొనుగోలుకు శుభ సమయం. స్థిరాస్తి వ్యవహారాలు కలిసివస్తాయి. కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆనందకరమైన సమయం గడుపుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు సాధ్యం. శివారాధన మీకు మంచి ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: నీలం
లక్కీ నెంబర్: 3
మిథునరాశి:
చంద్రబలం అనుకూలంగా ఉండటంతో పనుల్లో ఉత్సాహం, విజయం కనిపిస్తాయి. ఆర్థికంగా చాలా అనుకూలతలున్నాయి. కుటుంబం, పిల్లలతో సంతోషకరమైన రోజు. స్పెక్యులేషన్‌లకు దూరంగా ఉండండి. అమ్మవారి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 7
కర్కాటకరాశి:
ఈ రోజు చంద్రబలం బాగుంది. పనుల్లో విజయం సాధ్యం. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ, ఖర్చులు అదుపు తప్పవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకోండి, భవిష్యత్తులో లాభాలు వస్తాయి. శివారాధన మంచి ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: నలుపు
లక్కీ నెంబర్: 4
సింహరాశి:
ఈ రోజు చంద్రబలం అంత అనుకూలంగా లేదు. బంధుమిత్రుల రాక సూచన ఉంది. అనవసర వాగ్వివాదాలు కుటుంబ వాతావరణాన్ని పాడు చేయవచ్చు. నాలుకను అదుపులో ఉంచుకోండి. ఆర్థిక ఒత్తిడులు ఉన్నప్పటికీ, సమయానికి డబ్బు సర్దుబాటవుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మానసిక శాంతి పెరుగుతుంది.
లక్కీ కలర్: గులాబీ
లక్కీ నెంబర్: 6

కన్యారాశి:
ఈ రోజు చంద్రబలం అద్భుతంగా ఉంది. మీ మనసులోని కోరికలు నెరవేరే అవకాశం. పెళ్లికాని యువతీ యువకులకు వివాహ సంబంధాల విషయంలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థికంగా శుభవార్తలు. ఉద్యోగులకు పని ప్రదేశంలో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపారులకు అనుకూలం. లక్ష్మీదేవి ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి.
లక్కీ కలర్: నారింజ
లక్కీ నెంబర్: 8
తులారాశి:
చంద్రబలం అనుకూలంగా ఉండటంతో మానసిక ఉల్లాసం కనిపిస్తుంది. కుటుంబంతో సమయం గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆర్థికంగా అనుకూల రోజు. పంచముఖీ ఆంజనేయస్వామికి కొబ్బరి, బెల్లం సమర్పించండి. అద్భుత ఫలితాలు లభిస్తాయి.
లక్కీ కలర్: కాషాయం
లక్కీ నెంబర్: 7
వృశ్చికరాశి:
ఈ రోజు చంద్రబలం కొంచెం తక్కువగా ఉంది. ఎవరికీ అప్పు ఇవ్వవద్దు. గతంలో ఇచ్చిన అప్పుల వసూళ్లకు ప్రయత్నాలు ఫలించే అవకాశం తక్కువ. సోదరులతో విభేదాలు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూల రోజు. ఆడంబరాలకు ఖర్చు చేయకుండా అదుపులో ఉండండి. ఆపదామపహర్తారం మంత్రాన్ని 9 సార్లు జపించి రోజు ప్రారంభించండి.
లక్కీ కలర్: గోధుమ
లక్కీ నెంబర్: 6
ధనూరాశి:
ఈ రోజు చంద్రబలం అంత అనుకూలంగా లేదు. పనుల్లో ఆలస్యం జరగవచ్చు. అనవసర ఆగ్రహావేశాలకు లోనవ్వకండి. మానసికంగా కొంత భయం కనిపిస్తుంది. ముఖ్యమైన పని కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. కుటుంబంలో సామరస్యం కోసం సహనం అవసరం. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
లక్కీ కలర్: బూడిద
లక్కీ నెంబర్: 2
మకరరాశి:
ఈ రోజు చంద్రబలం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా అద్భుతమైన రోజు. వ్యాపారులకు, ఉద్యోగులకు శుభవార్తలు. అప్పులు తీర్చే అవకాశం. సానుకూల ఆలోచనలతో మంచి ఫలితాలు పొందుతారు. అమ్మవారి ఆరాధన చేయండి, గొప్ప ఫలితాలు లభిస్తాయి.
లక్కీ కలర్: ఆకుపచ్చ
లక్కీ నెంబర్: 5
కుంభరాశి:
చంద్రబలం కొంచెం అనుకూలంగా ఉంది. గత కొన్ని రోజులుగా ఉన్న సమస్యల నుండి మెల్లగా బయటపడతారు. నమ్మకద్రోహం చేసే వారితో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మిత్రుల నుండి అప్పు తీసుకునే అవకాశం. ఉద్యోగులకు, వ్యాపారులకు అనుకూల రోజు. శివారాధన మంచి ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 1
మీనరాశి:
చంద్రబలం తక్కువగా ఉన్నప్పటికీ, గురుబలం వల్ల పనుల్లో విజయం సాధ్యం. ఉద్యోగులైతే గతంలో ఎదురైన సమస్య నుండి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. విశ్వాసంతో పనులు చేపట్టండి, అనుమానాల వల్ల అవకాశాలు కోల్పోవద్దు. విష్ణు సహస్రనామాలు పఠించండి, అనుకూలతలు కలుగుతాయి.
లక్కీ కలర్: బంగారు రంగు
లక్కీ నెంబర్: 9
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

