DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope:సెప్టెంబర్ 20 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ అనుకోని అదృష్టం..

Today Horoscope:సెప్టెంబర్ 20 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ అనుకోని అదృష్టం.. ఈ మధ్య కాలంలో జాతకాలను నమ్మే వారు చాలా ఎక్కువ అయ్యారు. అలాగే నమ్మని వారు కూడా ఉన్నారు.

20 సెప్టెంబర్ 2025 – శనివారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం – భాద్రపద మాసం
తిథి: చతుర్దశి (రాత్రి 12:19+ వరకు, తరువాత అమావాస్య)
నక్షత్రం: మఖ (ఉదయం 8:02 వరకు, తరువాత పూర్వ ఫల్గుని/పుబ్బ)
వర్జ్యం: సాయంత్రం 4:34 నుండి 6:16 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 7:44 నుండి 8:32 వరకు
రాహుకాలం: ఉదయం 9:08 నుండి 10:39 వరకు
బ్రహ్మముహూర్తం: తెల్లవారుజామున 4:32 నుండి 5:20 వరకు
అమృత ఘడియలు: తెల్లవారుజామున 5:08 నుండి ఉదయం 6:48 వరకు
(నోట్: “+” అనగా మరుసటి రోజు)
మేషం నుండి మీనం వరకు ఈ రోజు దినఫలాలు ఉచితంగా మీ కోసం…

మేషరాశి:
ఈ రోజు గ్రహబలం అనుకూలత తక్కువగా ఉంది. దైవ కృపతో పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. వ్యాపారులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ చూపాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. మిత్రుల వల్ల ఇబ్బందులు రావచ్చు. శివారాధన చిక్కులను తొలగిస్తుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 9

వృషభరాశి:
గ్రహబలం మిశ్రమంగా ఉంది. పనులు వాయిదా పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నీరసంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి కనిపిస్తుంది. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉండవచ్చు. డబ్బు సర్దుబాటు అయినప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అప్పులిచ్చినవారు ఒత్తిడి చేయవచ్చు. అమ్మవారి ఆరాధన ఇబ్బందులను తొలగిస్తుంది.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 3

మిథునరాశి:
గ్రహబలం అనుకూలంగా ఉండటంతో తలపెట్టిన పనులు సఫలమవుతాయి. సన్మానాలు అందుకుంటారు. ఆర్థికంగా అద్భుతమైన రోజు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన రోజు. వ్యాపారాలు, ఉద్యోగాలు బాగా సాగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి, శుభ ఫలితాలు కలుగుతాయి.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 7

కర్కాటకరాశి:
చంద్రబలం అనుకూలంగా ఉంది. కుటుంబంతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. నూతన వాహనాలు కొనే అవకాశం ఉంది. బంగారం, భూములపై పెట్టుబడులు చేయవచ్చు. మనసులోని కోరికలు నెరవేరే అవకాశం. ఉద్యోగులకు అధికారుల మన్ననలు లభిస్తాయి. శివారాధన గొప్ప ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: నీలం
లక్కీ నెంబర్: 9

సింహరాశి:
గ్రహబలం అనుకూలంగా లేదు. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆర్థికంగా డబ్బు సర్దుబాటు అవుతుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల పని ఒత్తిడి ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు రాకుండా జాగ్రత్త వహించండి. రాహుకాలంలో అమ్మవారిని దర్శించండి, శుభం కలుగుతుంది.
లక్కీ కలర్: లేత ఎరుపు
లక్కీ నెంబర్: 3

కన్యారాశి:
గ్రహబలం మిశ్రమంగా ఉంది. పని ఒత్తిడి వల్ల అలసట రావచ్చు. కుటుంబ వాతావరణం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థికంగా మాత్రం అనుకూలమైన రోజు. వ్యాపారులు డబ్బు విషయాల్లో, ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండాలి. గణపతికి గరిక సమర్పిస్తే చిక్కులు తొలగుతాయి.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 5

తులారాశి:
గ్రహబలం అద్భుతంగా ఉంది. వ్యాపారులకు ధనలాభం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా సులభంగా సాగుతుంది. నూతన ఒప్పందాలకు అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులకు, ఉద్యోగులకు అనుకూలమైన రోజు. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, మరిన్ని శుభాలు కలుగుతాయి.
లక్కీ కలర్: కాషాయం
లక్కీ నెంబర్: 7

వృశ్చికరాశి:
గ్రహబలం సామాన్యంగా ఉంది. బంధువులతో వివాదాలు రాకుండా జాగ్రత్త వహించండి. పనుల్లో ఆలస్యం జరగవచ్చు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మాత్రం ఈ రోజు చాలా అనుకూలం. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. శివారాధన శుభ ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: లేత నీలం
లక్కీ నెంబర్: 6

ధనూరాశి:
గ్రహబలం అద్భుతంగా ఉంది. వ్యాపారులకు భారీ ధనలాభాలు కనిపిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతుల అవకాశం. పెద్దల ఆశీస్సులతో పనులు సఫలమవుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కనకధారాస్తోత్రం జపిస్తే మరింత అనుకూలతలు కలుగుతాయి.
లక్కీ కలర్: బంగారు రంగు
లక్కీ నెంబర్: 2

మకరరాశి:
గ్రహబలం సామాన్యంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది. మానసిక అశాంతి ఎదురవొచ్చు. డబ్బు సకాలంలో అందుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. పంచముఖి ఆంజనేయస్వామి దర్శనం శుభ ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: ఆకుపచ్చ
లక్కీ నెంబర్: 5

కుంభరాశి:
గ్రహబలం ఎంతో అనుకూలంగా ఉంది. ఆర్థికంగా చాలా రోజుల తర్వాత అనుకూలమైన రోజు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం. నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. శుభవార్తలు వింటారు. వ్యాపారులకు కొత్త అవకాశాలు, వృద్ధి కనిపిస్తాయి. శివునికి బిల్వపత్రాలు సమర్పిస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయి.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 1

మీనరాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. మీ మాటకు విలువ ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకు పదవీ యోగం కనిపిస్తుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు అనుకూలమైన రోజు. నూతన ఆదాయ మార్గాలు, కొత్త ఒప్పందాలకు శుభకరమైన రోజు. వృత్తి, వ్యాపారాలు రాణిస్తాయి. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. అమ్మవారి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: కనకాంబరం రంగు
లక్కీ నెంబర్: 9

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.