DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope in Telugu:సెప్టెంబర్ 21 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ కష్ట కాలం మొదలు..

Today Horoscope in Telugu:సెప్టెంబర్ 21 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ కష్ట కాలం మొదలు.. ఈ రోజుల్లో మనలో చాలా మంది జాతకాలను నమ్ముతున్నారు. అయితే కొంత మంది అసలు నమ్మరు. ఈ ఆర్టికల్ జాతకాలను నమ్మే వారి కోసం మాత్రమే..

మేషం
ఆత్మవిశ్వాసంతో చేపట్టే కార్యాలు విజయవంతం అవుతాయి. పనులలో అడ్డంకులు రాకుండా జాగ్రత్త వహించాలి. నిర్ణయాలలో ధైర్యంగా ముందుకు సాగితే సానుకూల ఫలితాలు లభిస్తాయి. నిపుణుల సలహాలు పనిలో పురోగతిని కలిగిస్తాయి. శివపార్వతీ ఆరాధన శుభకరం.

వృషభం
మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి. కొనుగోలు లేదా వ్యాపార వ్యవహారాల్లో లాభాలు అందుకుంటారు. మీ రంగంలో మిమ్మల్ని గౌరవించేవారి సంఖ్య పెరుగుతుంది. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.

మిథునం
కొన్ని పనులలో సవాళ్లు ఎదురైనప్పటికీ, వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు. సహచరుల సహాయంతో పనులు సాఫీగా సాగుతాయి. అవసరమైన సమయంలో సహాయం అందుతుంది. ఇష్టదైవ శ్లోకం పఠనం మేలు చేస్తుంది.

కర్కాటకం
ప్రయత్నానికి తగిన ఫలితాలు లభిస్తాయి. కార్యసిద్ధి కోసం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. లక్ష్యాలను చేరుకునే క్రమంలో శారీరక ఒత్తిడిని నివారించాలి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

సింహం
వృత్తి, వ్యాపార రంగాలలో లాభాలు ఉన్నాయి. సమయం అనుకూలంగా ఉంటుంది. సన్మానాలు, గౌరవాలు అందుకుంటారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. సూర్య ధ్యానం మేలు చేస్తుంది.

కన్య
మనశ్శాంతి, సంతోషం ఉంటాయి. వ్యాపారులకు సానుకూల సమయం. ఉద్యోగంలో అధిక శ్రమ రాకుండా చూసుకోవాలి. కొత్త వస్తువుల కొనుగోలు ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దుర్గాస్తోత్రం పఠనం శుభకరం.

తుల
మానసిక దృఢత్వంతో ఏ అడ్డంకినైనా ఎదుర్కొంటారు. శుభవార్త మీ ధైర్యాన్ని పెంచుతుంది. బంధుమిత్రులతో వ్యవహారాల్లో స్పష్టతను పాటించడం మంచిది. శివ అష్టోత్తర శతనామావళి పఠనం శుభప్రదం.

వృశ్చికం
మనోబలం దృఢంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటుచేసుకుంటాయి. బంధువుల ప్రేమ, సహకారం లభిస్తాయి. అన్నీ అనుకూలంగా సాగుతాయి. ఇష్టదైవ దర్శనం శుభకరం.

ధనుస్సు
చేపట్టిన పనులలో విజయాలు సాధిస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శని ధ్యానం శుభప్రదం.

మకరం
పనులలో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. శారీరక, మానసిక అలసటను నివారించాలి. మనశ్శాంతి కోసం జాగ్రత్త వహించాలి. చంద్రశేఖర అష్టకం పఠనం మానసిక శాంతిని ఇస్తుంది.

కుంభం
ఆర్థిక వ్యవహారంలో డబ్బు అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేస్తారు. సొంత గృహ నిర్మాణంలో పురోగతి సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. దుర్గాధ్యానం శుభకరం.

మీనం
పనులలో అధిక శ్రమ రాకుండా జాగ్రత్త వహించాలి. ఆర్థిక విషయాల్లో ఆదా విధానాన్ని అనుసరించడం మంచిది. ముఖ్యమైన సమస్యలను పరిష్కరించి, శత్రువులపై విజయం సాధిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన ఆపదలను తొలగిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.