SBI Scholarship: విద్యార్థులకు SBI శుభవార్త: ఏటా రూ.20 లక్షల వరకు స్కాలర్షిప్, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు!
SBI Scholarship: విద్యార్థులకు SBI శుభవార్త: ఏటా రూ.20 లక్షల వరకు స్కాలర్షిప్, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు..SBI ఫౌండేషన్ పేద విద్యార్థులకు అద్భుతమైన అవకాశాన్ని ప్రకటించింది. చదువుల్లో ప్రతిభ కనబరిచే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025ను ప్రవేశపెట్టింది.
2025 సంవత్సరానికి సంబంధించి ఈ స్కాలర్షిప్ కింద దేశవ్యాప్తంగా 23,230 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఒక్కొక్క విద్యార్థికి వారి విద్యార్హత ఆధారంగా రూ.20 లక్షల వరకు స్కాలర్షిప్ అందజేయనున్నారు. ఈ స్కాలర్షిప్ ద్వారా భవిష్యత్ భారత నిర్మాతలను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు SBI ఫౌండేషన్ తెలిపింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కాలర్షిప్ కోసం రూ.90 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. 2022లో గొప్ప ఆశయంతో ఈ స్కాలర్షిప్ను ప్రారంభించినట్లు SBI ఫౌండేషన్ వెల్లడించింది. ఈ సందర్భంగా SBI ఛైర్మన్ సీ. శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ, “ఈ సంవత్సరం SBI ప్లాటినం జూబ్లీ వేడుకలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అదే పేరుతో స్కాలర్షిప్ ప్రారంభించడం గర్వకారణం. 23,230 మంది పేద విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ద్వారా ఉన్నత విద్యను అందించే అవకాశం కల్పించబడుతుంది,” అని పేర్కొన్నారు.

స్కాలర్షిప్ ముఖ్య వివరాలు:
ఎవరు అర్హులు? 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివే పేద విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అర్హులు.
ఆర్థిక సాయం: ఎంపికైన కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం రూ.15 వేల నుంచి రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు.
అప్లికేషన్ విధానం: అర్హత కలిగిన విద్యార్థులు నవంబర్ 15, 2025లోపు www.sbiashascholarship.co.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎవరు దరఖాస్తు చేయవచ్చు? స్కూల్ విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, మెడికల్ విద్యార్థులు, ఐఐటీ, ఐఐఎం విద్యార్థులతో పాటు విదేశీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.
అర్హత ప్రమాణాలు:
గత ఏడాది 75 శాతం మార్కులు లేదా 7 CGPA సాధించి ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం: స్కూల్ విద్యార్థులకు రూ.3 లక్షలు, ఇతర కేటగిరీలకు రూ.6 లక్షలు.
SC/ST విద్యార్థులకు 10 శాతం సడలింపు ఉంటుంది.
రెన్యూవల్: స్కాలర్షిప్ను ప్రతి సంవత్సరం రెన్యూ చేసుకోవాలి, అయితే కనీస అర్హత ప్రమాణాలు సాధించాలి.
ఈ స్కాలర్షిప్ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు SBI ఫౌండేషన్ కృషి చేస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

