Stock market today: సెప్టెంబర్ 22 వ తేదీ సోమవారం స్టాక్ మార్కెట్లో ఒక లుక్ వేయాల్సిన షేర్స్..
Stock market today: సెప్టెంబర్ 22 వ తేదీ సోమవారం స్టాక్ మార్కెట్లో ఒక లుక్ వేయాల్సిన షేర్స్.. ట్రేడర్లు ఈరోజు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ బై లిస్టును నిపుణులు వెల్లడించారు. ఇందులో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఇంకా లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్‌డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 388 పాయింట్లు క్షీణించి 82,626 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50 ఇండెక్స్ 97 పాయింట్లు తగ్గి 25,327 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 269 పాయింట్లు పడి 55,459 వద్దకు చేరింది.
భారత టెక్ ఉద్యోగులకు కీలకమైన H1B వీసా ఫీజును భారీగా పెంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందరినీ షాక్‌కు గురిచేశారు. ఇది టెక్ సెక్టార్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ మార్కెట్‌లో టెక్ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టి ఉండనుంది.
ఎఫ్‌ఐఐలు, డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌లో ఎఫ్‌ఐఐలు రూ. 351.88 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,953.82 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ట్రంప్ H1B వీసా ఫీజు పెంపు ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ సుమారు 95 పాయింట్ల నష్టంలో ఉండటం దీనికి కారణం.

“నిఫ్టీ50కి 25,500 రెసిస్టెన్స్‌గా పనిచేస్తోంది. అది బ్రేక్ అయితే సూచీ 25,750 వరకు పెరగవచ్చు. 24,900-25,150 లెవల్స్ సపోర్ట్‌గా ఉన్నాయి,” అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా వివరించారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. డౌ జోన్స్ 0.37% పెరిగింది. S&P 500 0.49% వృద్ధి చెందింది. టెక్ ఇండెక్స్ నాస్‌డాక్ 0.72% పుంజుకుంది.ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రాడక్ట్స్ – బై రూ. 1140, స్టాప్ లాస్ రూ. 1100, టార్గెట్ రూ. 1222
అజ్మేరా రియాల్టీ-ఇన్‌ఫ్రా ఇండియా – బై రూ. 1052, స్టాప్ లాస్ రూ. 1015, టార్గెట్ రూ. 1130
రాలీస్ ఇండియా – బై రూ. 336, స్టాప్ లాస్ రూ. 325, టార్గెట్ రూ. 357
కిర్లోస్కర్ న్యుమాటిక్ కంపెనీ – బై రూ. 1260, స్టాప్ లాస్ రూ. 1225, టార్గెట్ రూ. 1320
పీఎన్‌బీ హౌజింగ్ ఫైనాన్స్ – బై రూ. 871, స్టాప్ లాస్ రూ. 850, టార్గెట్ రూ. 900
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
అనంత్ రాజ్: రూ. 640 వద్ద కొనండి, టార్గెట్ రూ. 690, స్టాప్ లాస్ రూ. 615
తాన్లా ప్లాట్‌ఫామ్స్: రూ. 753 వద్ద కొనండి, టార్గెట్ రూ. 810, స్టాప్ లాస్ రూ. 725
సెంటమ్ ఎలక్ట్రానిక్స్: రూ. 2832 వద్ద కొనండి, టార్గెట్ రూ. 3030, స్టాప్ లాస్ రూ. 2727
కార్ట్రేడ్ టెక్: రూ. 2540 వద్ద కొనండి, టార్గెట్ రూ. 2730, స్టాప్ లాస్ రూ. 2450
పిసిబిఎల్ కెమికల్: రూ. 413 వద్ద కొనండి, టార్గెట్ రూ. 444, స్టాప్ లాస్ రూ. 399
(గమనిక: ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. chaipakodiకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లు స్వంత ఎనాలసిస్ చేసుకోవడం మంచిది.)

