Today Horoscope:సెప్టెంబర్ 25 రాశి ఫలాలు.. ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే..
Today Horoscope:సెప్టెంబర్ 25 రాశి ఫలాలు.. ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే.. మనలో చాలా మంది జాతకాలను నమ్ముతూ ఉంటారు. అలాగే కొంత మంది అసలు నమ్మరు.
25 సెప్టెంబర్ 2025 – గురువారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
తిథి: తదియ (ఉ. 7:06 వరకు), తరువాత చవితి
నక్షత్రం: స్వాతి (రా. 7:03 వరకు), తరువాత విశాఖ
వర్జ్యం: రా. 1:26 నుండి తె. 3:14 వరకు
దుర్ముహూర్తం: ఉ. 10:08 నుండి ఉ. 10:55 వరకు, మ. 2:55 నుండి మ. 3:41 వరకు
రాహుకాలం: మ. 1:37 నుండి మ. 3:07 వరకు
యమగండం: ఉ. 6:09 నుండి ఉ. 7:38 వరకు
బ్రహ్మముహూర్తం: తె. 4:33 నుండి తె. 5:21 వరకు
అమృత ఘడియలు: ఉ. 9:18 నుండి ఉ. 11:05 వరకు
నోట్: “+” అనగా మరుసటి రోజు
ద్వాదశ రాశుల దిన ఫలాలు:
మేష రాశి:
ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. రాజకీయ నాయకులు, మీడియా వృత్తివారికి శుభకరమైన రోజు. వ్యాపారులకు గణనీయమైన ధనలాభం కనిపిస్తుంది. ఉద్యోగులకు గత ఇబ్బందులు తొలగుతాయి. అమ్మవారి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
అదృష్ట రంగు: తెలుపు, గంధం రంగు
అదృష్ట సంఖ్య: 1
వృషభ రాశి:
గ్రహబలం ఎంతో అనుకూలం. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. శుభవార్త మీ ఆనందాన్ని పెంచుతుంది. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. సాయిబాబాకు మిఠాయి సమర్పించి దర్శనం చేసుకోండి.
అదృష్ట రంగు: లేత పసుపు
అదృష్ట సంఖ్య: 7
మిథున రాశి:
గ్రహబలం అంతగా అనుకూలం కాదు. వృత్తి, వ్యాపారాల్లో శ్రద్ధ అవసరం. నష్టాలు రాకుండా జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. సంతానం, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. శివారాధన శుభ ఫలితాలనిస్తుంది.
అదృష్ట రంగు: లేత నీలం
అదృష్ట సంఖ్య: 3

కర్కాటక రాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. శుభవార్తలు, సన్మానాలు, కీర్తి లభిస్తాయి. వాహన కొనుగోలుకు అవకాశం ఉంది. బంగారం, స్టాక్‌లలో పెట్టుబడులు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి.
అదృష్ట రంగు: బంగారు రంగు
అదృష్ట సంఖ్య: 9
సింహ రాశి:
గ్రహబలం అద్భుతంగా ఉంది. నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా శుభకరమైన రోజు. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అమ్మవారికి ఎరుపు పుష్పాలు సమర్పించండి.
అదృష్ట రంగు: కనకాంబరం రంగు
అదృష్ట సంఖ్య: 6
కన్యా రాశి:
గ్రహబలం సామాన్యంగా ఉంది. అప్పుల ఒత్తిడి ఉండవచ్చు. దూర ప్రయాణాలు శ్రమను మిగులుస్తాయి. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది, కానీ పని ఒత్తిడి ఉంటుంది. అమ్మవారికి చామంతి పూలమాల, 9 నిమ్మకాయలు సమర్పించండి.
అదృష్ట రంగు: ఎరుపు
అదృష్ట సంఖ్య: 9
తులా రాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. ఆర్థిక లాభాలతో మానసిక ఆనందం కలుగుతుంది. జీవిత భాగస్వామి సలహాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు శుభకరం. ఉద్యోగులకు అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. గణపతికి గరిక పూజ చేయించండి.
అదృష్ట రంగు: పచ్చ
అదృష్ట సంఖ్య: 1
వృశ్చిక రాశి:
గ్రహబలం అంతగా అనుకూలం కాదు. ఆరోగ్య సమస్యలు, ఖర్చులు ఇబ్బందిపెట్టవచ్చు. వాదోపవాదాలు లేకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగులకు, వ్యాపారులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. శివారాధన ఇబ్బందులను తొలగిస్తుంది.
అదృష్ట రంగు: ముదురు నీలం
అదృష్ట సంఖ్య: 3
ధనూ రాశి:
గ్రహబలం అనుకూలం. వృత్తి, ఉద్యోగాలు కలిసివస్తాయి. నూతన ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు అనుకోని లాభాలు. టీచింగ్, మీడియా వృత్తులవారికి శుభకరం. ఆత్మీయుల నుండి దూరం కావడం మనసును కలిచివేయవచ్చు. అమ్మవారి ఆరాధన మానసిక ధైర్యాన్నిస్తుంది.
అదృష్ట రంగు: బంగారు రంగు
అదృష్ట సంఖ్య: 5
మకర రాశి:
గ్రహబలం శుభకరం. మీ మాటకు విలువ ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కనిపిస్తాయి. ఉద్యోగులకు గుర్తింపు, బోనస్‌లు లభిస్తాయి. కుటుంబంతో ఆనందకరమైన సమయం గడుపుతారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఆరాధించండి.
అదృష్ట రంగు: ఊదా
అదృష్ట సంఖ్య: 1
కుంభ రాశి:
గ్రహబలం అనుకూలం కాదు. వివాదాల్లో చిక్కుకోవచ్చు, మాట జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాద సూచన ఉంది. ఉద్యోగులకు నిరాశాజనక వాతావరణం. వ్యాపారులు నష్టాలను నివారించాలి. అప్పులు తీసుకోవద్దు. అమ్మవారి ఆరాధన ఇబ్బందుల నుండి కాపాడుతుంది.
అదృష్ట రంగు: ముదురు ఎరుపు
అదృష్ట సంఖ్య: 1
మీన రాశి:
గ్రహబలం సామాన్యంగా ఉంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. హామీలు ఇవ్వకండి. దూర ప్రయాణాలు వాయిదా వేయండి. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వేంకటేశ్వరస్వామికి తులసిమాల సమర్పించండి.
అదృష్ట రంగు: పసుపు
అదృష్ట సంఖ్య: 1
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

