Stock market today: సెప్టెంబర్ 26 వ తేదీ శుక్రవారం స్టాక్ మార్కెట్లో ఒక లుక్ వేయాల్సిన షేర్స్..
Stock market today: సెప్టెంబర్ 26 వ తేదీ శుక్రవారం స్టాక్ మార్కెట్లో ఒక లుక్ వేయాల్సిన షేర్స్..నేటి రోజు ట్రేడర్లు దృష్టి సారించాల్సిన స్టాక్‌ల బై జాబితాను నిపుణులు ప్రకటించారు. ఇందులో బ్రేక్ఔట్ స్టాక్‌లు కూడా చేర్చబడ్డాయి.
గురువారం ట్రేడింగ్ సెషన్లో భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 556 పాయింట్లు క్షీణించి 81,160 వద్ద ముగిసింది. నిఫ్టీ50 ఇండెక్స్ 166 పాయింట్లు తగ్గి 24,891 వద్ద సెషన్‌ను ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 145 పాయింట్లు పడిపోయి 54,976 వద్ద స్థిరపడింది.
ఎఫ్ఐఐలు మరియు డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5,097.51 కోట్ల విలువైన షేర్లను అమ్మకానికి ఉంచారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,105.60 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉండనుంది?
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను సూచీలు నష్టాలతో మొదలుపెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ సుమారు 65 పాయింట్ల నష్టంలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

“నిఫ్టీ50 ఇండెక్స్ 25,000 లెవల్ కంటే కిందికి జారిపోయింది. ఇది మార్కెట్ సెంటిమెంట్ నెగటివ్‌గా మారినట్లు సూచిస్తోంది! 25,000-25,050 రేంజ్లో రెసిస్టెన్స్ ఉండవచ్చు. అయితే 24,700-24,750 లెవల్స్ వద్ద సపోర్ట్ కనిపిస్తోంది,” అని ఛాయిస్ బ్రోకింగ్‌కు చెందిన టెక్నికల్ మరియు డెరివేటివ్ ఎనలిస్ట్ అమృత షిండె వివరించారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. డౌ జోన్స్ 0.38 శాతం తగ్గింది. ఎస్ అండ్ పీ 500 0.50 శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.50 శాతం క్షీణించింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.
స్టాక్‌లు టు బై..
భారతీ హెక్సాకామ్ – బై రూ. 1727.8, స్టాప్ లాస్ రూ. 1670, టార్గెట్ రూ. 1845
నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా – బై రూ. 3613.5, స్టాప్ లాస్ రూ. 3500, టార్గెట్ రూ. 3840
ఎస్బీఐ – బై రూ. 861, స్టాప్ లాస్ రూ. 850, టార్గెట్ రూ. 885
ఫినోలెక్స్ కేబుల్స్ – బై రూ. 820, స్టాప్ లాస్ రూ. 810, టార్గెట్ రూ. 840
ఔరబిందో ఫార్మా – బై రూ. 1098, స్టాప్ లాస్ రూ. 1080, టార్గెట్ రూ. 1125
బ్రేక్ఔట్ స్టాక్‌లు టు బై..
అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్: రూ. 110.4 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ. 118, స్టాప్ లాస్ రూ. 106;
హింద్‌వేర్ హోమ్ ఇన్నోవేషన్: రూ. 327 వద్ద కొనండి, టార్గెట్ రూ. 360, స్టాప్ లాస్ రూ. 320;
ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్: రూ. 205.5 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ. 221, స్టాప్ లాస్ రూ. 197;
కేఐఓసీఎల్: రూ. 457 వద్ద కొనండి, టార్గెట్ రూ. 495, స్టాప్ లాస్ రూ. 440;
హిందుస్థాన్ జింక్: రూ. 466 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ. 500, స్టాప్ లాస్ రూ. 450
(గమనిక: ఇవి కేవలం నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుతో ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లు స్వంత ఎనాలసిస్ చేసుకోవడం మంచిది.)

