Gold Rate Today:రికార్డ్ స్థాయిలో వెండి ధర.. చుక్కలు చూపిస్తున్న బంగారం..ఇలా ఉంటే కొనటం కష్టమే..
Gold Rate Today:రికార్డ్ స్థాయిలో వెండి ధర.. చుక్కలు చూపిస్తున్న బంగారం..ఇలా ఉంటే కొనటం కష్టమే..సెప్టెంబర్ 27, 2025, శనివారం నాడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటితో పోలిస్తే, నీటి బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు పెరగడానికి కారణాలు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో కూడా ఇప్పుడు చూద్దాం.
ఈ రోజు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,690గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,05,700గా నమోదైంది. ఒక కిలో వెండి ధర రూ. 1,43,551గా ఉంది. గత 15 రోజులుగా బంగారం ధరలు ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలను తాకుతూ, రోజురోజుకూ పెరుగుతున్నాయి.
బంగారం ధరలు భారీగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ప్రధాన కారణం. ముఖ్యంగా డాలర్ విలువ గణనీయంగా తగ్గడం బంగారం ధరల పెరుగుదలకు దోహదపడింది. అదనంగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించడంతో, అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ కూడా పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు, ఫలితంగా బంగారం డిమాండ్ పెరుగుతోంది.
అంతర్జాతీయంగా, చాలా దేశాలు తమ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి, ముఖ్యంగా చైనా భారీగా బంగారం కొనుగోలు చేస్తోంది, ఇది కూడా ధరల పెరుగుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇక మన దేశంలో, పండుగల సీజన్ ప్రారంభమైంది. సాధారణంగా ఈ సమయంలో జనం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.

కానీ, ధరలు భారీగా పెరగడంతో, 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 1.05 లక్షలు దాటడంతో, ఒక చిన్న 10 గ్రాముల బంగారు గొలుసు కొనడానికి కూడా రూ. 1.25 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సామాన్యులు బంగారు ఆభరణాల కొనుగోలుపై ఆసక్తి తగ్గించారని నగల దుకాణ యజమానులు చెబుతున్నారు.
భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే సందేహం చాలా మందిలో ఉండవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తులపై 100% సుంకం విధించారు.
ఇది అమెరికా స్టాక్ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. మందుల ధరలు పెరగడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మరింత వేగంగా బంగారం వైపు మళ్లించే అవకాశం ఉంది, ఇది బంగారం ధరలు మరింత పెరగడానికి దారితీస్తుంది.
ఇక వెండి ధరల విషయానికొస్తే, ఒక కిలో వెండి ధర రూ. 1.43 లక్షలకు చేరుకుంది, ఇది ఆల్-టైమ్ గరిష్ట స్థాయి. పారిశ్రామిక డిమాండ్ పెరగడం వల్ల వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

