BusinessToday gold rate

Gold Price Today:భయపడిపోతున్న మహిళలు.. భారీగా పెరిగిన బంగారం ధర.. ఎలా ఉన్నాయంటే..

Gold Price Today:భయపడిపోతున్న మహిళలు.. భారీగా పెరిగిన బంగారం ధర.. ఎలా ఉన్నాయంటే.. దేశంలో ఎంత పేద కుటుంబం అయినా కొంతైనా బంగారం తప్పకుండా ఉంటుంది. అయితే, ఇప్పుడు బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక తులం (10 గ్రాములు) బంగారం కొనాలంటే రూ.1,16,000కి పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. తాజాగా, సెప్టెంబర్ 30, 2025 నాటికి దేశంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి.

బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి, దీంతో మహిళలు ఒక్క గ్రాము బంగారం కొనడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. భారతీయ సంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పండుగలు, శుభ కార్యాల సమయంలో బంగారం కొనడం తప్పనిసరి. కానీ, ప్రస్తుతం ధరలు భారీగా పెరగడంతో ఈ సంప్రదాయం భారంగా మారుతోంది. నిన్నటికి ఈ రోజుకి పోలిస్తే, ఒక తులం 24 క్యారెట్ బంగారం ధర రూ.930 పెరిగి రూ.1,16,410కి చేరింది.

గత రెండు మూడు రోజుల్లోనే తులం బంగారం ధర దాదాపు రూ.2,000కి పైగా పెరిగింది. వెండి ధరలు కూడా ఇదే ధోరణిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక కిలో వెండి ధర రూ.1,50,000 వద్ద ఉండగా, హైదరాబాద్, చెన్నై, కేరళ వంటి ప్రాంతాల్లో ఇది రూ.1,60,000 వరకు ఉంది. ఈ ధరలు సెప్టెంబర్ 30, 2025 ఉదయం 6 గంటల సమయంలో నమోదైనవి మాత్రమే. రోజు గడిచే కొద్దీ ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా ఉండవచ్చు.దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:

ఢిల్లీ:
24 క్యారెట్ 10 గ్రాముల బంగారం: రూ.1,16,560
22 క్యారెట్ 10 గ్రాముల బంగారం: రూ.1,06,860
ముంబై:
24 క్యారెట్ 10 గ్రాముల బంగారం: రూ.1,16,410
22 క్యారెట్ 10 గ్రాముల బంగారం: రూ.1,06,710
హైదరాబాద్:
24 క్యారెట్ 10 గ్రాముల బంగారం: రూ.1,16,410
22 క్యారెట్ 10 గ్రాముల బంగారం: రూ.1,06,710
విజయవాడ:
24 క్యారెట్ 10 గ్రాముల బంగారం: రూ.1,16,410
22 క్యారెట్ 10 గ్రాముల బంగారం: రూ.1,06,710
చెన్నై:
24 క్యారెట్ 10 గ్రాముల బంగారం: రూ.1,16,740
22 క్యారెట్ 10 గ్రాముల బంగారం: రూ.1,07,010
బెంగళూరు:
24 క్యారెట్ 10 గ్రాముల బంగారం: రూ.1,16,410
22 క్యారెట్ 10 గ్రాముల బంగారం: రూ.1,06,710

బంగారం కొనుగోలు చేసేటప్పుడు దాని స్వచ్ఛతను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థలు బంగారం స్వచ్ఛతను ధృవీకరించడానికి హాల్‌మార్క్‌ను ఉపయోగిస్తాయి. ఈ హాల్‌మార్క్ బంగారం యొక్క క్యారెట్ విలువను సూచిస్తుంది: 24 క్యారెట్‌పై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. సాధారణంగా బంగారం ఆభరణాలు 22 క్యారెట్ లేదా 18 క్యారెట్‌లో లభిస్తాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.