Business

Spam calls:స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సులభమైన చిట్కాలతో వాటిని శాశ్వతంగా అడ్డుకోండి!

Spam calls:స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సులభమైన చిట్కాలతో వాటిని శాశ్వతంగా అడ్డుకోండి..ఈ రోజుల్లో స్పామ్ కాల్స్‌ హద్దులు మీరిపోతున్నాయి. రోజూ ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్‌ మోగుతూనే ఉంటుంది. ఇందులో కొన్ని టెలీమార్కెటింగ్ కాల్స్‌ అయితే, మరికొన్ని ఏఐ ఆధారిత స్కామ్ కాల్స్‌. ఈ కాల్స్‌తో విసిగిపోయిన వారు ఈ సాధారణ సెట్టింగ్స్‌ మార్చుకుంటే స్పామ్ కాల్స్‌ బెడద నుంచి బయటపడొచ్చు!

లోన్‌ అంగీకారం అయిందని, ఉచిత క్రెడిట్ కార్డ్‌ ఇస్తామని చెప్పే స్పామ్ కాల్స్‌ రోజూ విసుగు తెప్పిస్తున్నాయి. ఇవి సమయం వృథా చేయడమే కాక, కొన్నిసార్లు మోసాలకు గురి చేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే వీటిని నియంత్రించడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి:
1. డీఎన్‌డీ (DND) సర్వీస్‌
స్పామ్ కాల్స్‌ను అడ్డుకోవడానికి మీ సిమ్‌ ఆధారంగా ఎయిర్‌టెల్, జియో, లేదా వీఐ యాప్‌లోకి వెళ్లండి. అక్కడ సెట్టింగ్స్‌ లేదా సర్వీసెస్‌ విభాగంలో ‘డీఎన్‌డీ (Do Not Disturb)’ ఆప్షన్‌ కోసం వెతకండి. ఈ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేస్తే ఆటోమేటెడ్ కాల్స్‌ చాలా వరకు తగ్గుతాయి.
అలాగే, మీ ఫోన్‌లోని మెసేజ్‌ యాప్‌లోకి వెళ్లి, ‘FULLY BLOCK’ అని టైప్‌ చేసి 1909 నంబర్‌కు పంపండి. లేదా, 1909కు కాల్‌ చేసి బ్లాక్‌ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల టెలీమార్కెటింగ్ కాల్స్‌ గణనీయంగా తగ్గుతాయి.
2. కాలర్ ఐడీ & స్పామ్ ఫిల్టర్‌
ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వాడే వారు గూగుల్ డయలర్‌ యాప్‌లోకి వెళ్లండి. అక్కడ పైన కనిపించే మూడు చుక్కల (Three Dots) మీద క్లిక్‌ చేసి మెనూలోకి వెళ్లండి. సెట్టింగ్స్‌లో ‘కాలర్‌ ఐడీ & స్పామ్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి, ‘ఎనేబుల్‌ ఫిల్టర్‌ స్పామ్‌ కాల్స్‌’ ఆప్షన్‌ను ఆన్‌ చేయండి. ఇలా చేస్తే ఆటోమేటెడ్ స్పామ్ కాల్స్‌ బ్లాక్‌ అవుతాయి. దీనికోసం మీ ఫోన్‌లో గూగుల్ డయలర్‌ను డిఫాల్ట్‌ డయలర్‌గా సెట్‌ చేయాల్సి ఉంటుంది.
3. ట్రూకాలర్‌ యాప్‌
ట్రూకాలర్‌ యాప్‌ ద్వారా కూడా స్పామ్ కాల్స్‌ను సమర్థవంతంగా బ్లాక్‌ చేయవచ్చు. తరచూ వచ్చే స్పామ్ కాల్స్‌లో ఒకే రకమైన స్టార్టింగ్ నంబర్‌ ఉంటుంది. వాటిని ట్రూకాలర్‌ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి. ట్రూకాలర్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ‘బ్లాకింగ్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి, ‘మేనేజ్‌ బ్లాక్‌లిస్ట్‌’లోకి వెళ్లండి. అక్కడ స్టార్టింగ్ నంబర్‌లను ఎంటర్‌ చేసి బ్లాక్‌ చేయండి. అలాగే, స్పామ్ కాల్‌ వచ్చినప్పుడు దాన్ని స్పామ్ లిస్ట్‌లో చేర్చితే, ఆ నంబర్‌ నుంచి మళ్లీ కాల్స్‌ రాకుండా ఉంటాయి.ఈ సులభమైన దశలతో స్పామ్ కాల్స్‌ బెడద నుంచి విముక్తి పొందండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.