Business

Stock market today: సెప్టెంబర్ 30 వ తేదీ మంగళవారం స్టాక్ మార్కెట్లో ఒక లుక్ వేయాల్సిన షేర్స్..

Stock market today: సెప్టెంబర్ 30 వ తేదీ మంగళవారం స్టాక్ మార్కెట్లో ఒక లుక్ వేయాల్సిన షేర్స్.. నేడు ట్రేడర్లు ట్రాక్ చేయవలసిన స్టాక్‌ల బై లిస్ట్‌ను నిపుణులు ప్రకటించారు. ఇందులో బ్రేకౌట్ స్టాక్‌ల జాబితాను కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, స్టాక్ మార్కెట్ ఇటీవలి అప్‌డేట్‌లను ఇక్కడే చూడండి.

స్టాక్ మార్కెట్ అప్‌డేట్‌లు..
సోమవారం వ్యాపార సెషన్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 62 పాయింట్లు తగ్గి 80,365 వద్ద ముగిసింది. నిఫ్టీ50 ఇండెక్స్ 20 పాయింట్లు క్షీణించి 24,635 వద్ద సెషన్‌ను ముగించింది. అయితే, బ్యాంక్ నిఫ్టీ 72 పాయింట్లు పెరిగి 54,461కి చేరుకుంది.

ఎఫ్‌ఐఐలు.. డీఐఐలు..
సోమవారం సెషన్‌లో ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) రూ. 2,805.34 కోట్ల విలువైన షేర్లను అమ్మకానికి పెట్టారు. అదే సమయంలో డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ. 3,690.06 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది?
మంగళవారం వ్యాపార సెషన్ సూచీలు స్థిరంగా ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ సుమారు 10 పాయింట్ల లాభంతో ఉండటం దీనికి సూచన. “నిఫ్టీ50 స్వల్పకాలంలో 24,500-24,850 మధ్య వ్యాపారం జరిగే అవకాశం ఉంది. 24,850 పైన ముగిస్తే, సూచీ మరింత పెరగవచ్చు,” అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ వత్సర్ భువా వ్యాఖ్యానించారు.

అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం సెషన్‌లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. డౌ జోన్స్ 0.15 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.26 శాతం వృద్ధి చెందింది. టెక్ ఇండెక్స్ నాస్‌డాక్ 0.48 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్‌లో స్థిరంగా కొనసాగుతున్నాయి.
స్టాక్‌లు టు బై..
ఉషా మార్టిన్ – బై రూ. 476.45, స్టాప్ లాస్ రూ. 450, టార్గెట్ రూ. 530
ఇండియన్ బ్యాంక్ – బై రూ. 724.6, స్టాప్ లాస్ రూ. 700, టార్గెట్ రూ. 774
ఎస్‌బీఐ – బై రూ. 861, స్టాప్ లాస్ రూ. 850, టార్గెట్ రూ. 885
పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ – బై రూ. 870, స్టాప్ లాస్ రూ. 845, టార్గెట్ రూ. 900
ఔరబిందో ఫార్మా – బై రూ. 1088, స్టాప్ లాస్ రూ. 1070, టార్గెట్ రూ. 1125

బ్రేకౌట్ స్టాక్‌లు టు బై..
కిల్బర్న్ ఇంజనీరింగ్: రూ. 580 వద్ద కొనండి, టార్గెట్ రూ. 625, స్టాప్ లాస్ రూ. 560;
విశాల్ మెగా మార్ట్: రూ. 148.5 వద్ద కొనండి, టార్గెట్ రూ. 160, స్టాప్ లాస్ రూ. 143;
భారత్ సీట్స్: రూ. 179.7 వద్ద కొనండి, టార్గెట్ రూ. 194, స్టాప్ లాస్ రూ. 173;
సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్: రూ. 634 వద్ద కొనండి, టార్గెట్ రూ. 680, స్టాప్ లాస్ రూ. 613;
బజార్ స్టైల్ రిటైల్: రూ. 370 వద్ద కొనండి, టార్గెట్ రూ. 400, స్టాప్ లాస్ రూ. 355.

(గమనిక: ఇవి కేవలం నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. chaipakodiతో ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ చేసే ముందు ట్రేడర్లు స్వంతంగా విశ్లేషణ చేసుకోవడం మంచిది.)