DevotionalToday Rasi Phalalu In telugu

Horoscope Today (October 1, 2025): ఈ రోజు రాశిఫలాలు… మేషం తో సహా ఈ 6 రాశులకు అనుకోని లాభాలు..

Horoscope Today (October 1, 2025): ఈ రోజు రాశిఫలాలు… మేషం తో సహా ఈ 6 రాశులకు అనుకోని లాభాలు.. ఈ మధ్య కాలంలో జాతకాలను చాలా ఎక్కువగా నమ్ముతున్నారు. అలాగే కొంత మంది అసలు నమ్మటం లేదు.

01 అక్టోబర్ 2025 – బుధవారం రాశి ఫలాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
తిథి: నవమి (సాయంత్రం 6:56 వరకు), తరువాత దశమి
నక్షత్రం: పూర్వాషాఢ (ఉదయం 7:57 వరకు), తరువాత ఉత్తరాషాఢ
వర్జ్యం: సాయంత్రం 4:28 నుండి 6:08 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:29 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12:05 నుండి 1:34 వరకు
యమగండం: ఉదయం 7:38 నుండి 9:07 వరకు
గుళికాకాలం: ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:05 వరకు
బ్రహ్మముహూర్తం: తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు
అమృత ఘడియలు: రాత్రి 2:30 నుండి తెల్లవారుజామున 4:10 వరకు
అభిజిత్ ముహూర్తం: ఈ రోజు లేదు

ఈ రోజు మేషం సహా ఆరు రాశులకు గ్రహబలం అనుకూలంగా ఉండి, అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. కొన్ని రాశులకు సవాళ్లు ఎదురైనప్పటికీ, వాటిని అధిగమించేందుకు ఏ దేవతారాధన చేయాలో క్రింద వివరించడం జరిగింది. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశులకు ఈ రోజు ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి:

మేషరాశి
ఈ రోజు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ నిర్ణయాలు భవిష్యత్తు వృద్ధికి దోహదపడతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. భూ సంబంధిత లావాదేవీల్లో లాభం కలుగుతుంది. ఉద్యోగులకు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు అన్నీ లాభదాయకంగా ఉంటాయి.
శుభ పరిహారం: అమ్మవారికి కుంకుమపూజ చేయించండి.
అనుకూల రంగు: బంగారు రంగు
అనుకూల సంఖ్య: 9

వృషభరాశి
గ్రహబలం పాక్షికంగా అనుకూలం. పనులు నిదానంగా సాగుతాయి. అనుకోని సమస్యలు రావచ్చు. ఆరోగ్యం, ఖర్చులపై శ్రద్ధ వహించండి. ఆడంబరాలకు ధనం వృథా చేయవద్దు. వృత్తి, ఉద్యోగాలు శ్రమతో కూడిన ఫలితాలిస్తాయి.
శుభ పరిహారం: అమ్మవారి దర్శనం చేసుకోండి.
అనుకూల రంగు: పసుపు
అనుకూల సంఖ్య: 3

మిథునరాశి
గ్రహబలం కొంత తక్కువగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో నిరుత్సాహం కనిపిస్తుంది. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు. అప్పుల ఒత్తిడి, వ్యాపారులకు పని ఒత్తిడి ఉండవచ్చు.
శుభ పరిహారం: శివారాధన మనశ్శాంతినిస్తుంది.
అనుకూల రంగు: లేత వంగపండు రంగు
అనుకూల సంఖ్య: 3

కర్కాటకరాశి
గ్రహబలం అనుకూలం. పనులు ఆలస్యమైనా విజయవంతంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది. రాజకీయకులకు శుభవార్త. కుటుంబంతో ఆనందకర సమయం. ఉద్యోగులకు బోనస్ లభించవచ్చు.
శుభ పరిహారం: అమ్మవారి దర్శనం చేసుకోండి.
అనుకూల రంగు: కనకాంబరం రంగు
అనుకూల సంఖ్య: 5

సింహరాశి
గ్రహబలం అనుకూలం. బంధుమిత్రుల సహాయంతో ముఖ్యమైన పని పూర్తవుతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలం. చిన్ననాటి మిత్రులతో వినోదం. ఉద్యోగులకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
శుభ పరిహారం: అమ్మవారికి చామంతి మాల సమర్పించండి.
అనుకూల రంగు: లేత పసుపు
అనుకూల సంఖ్య: 3

కన్యారాశి
గ్రహబలం చాలా అనుకూలం. దీర్ఘకాల సమస్య నుండి బయటపడతారు. అప్పుల నుండి విముక్తి, ఋణం తీర్చే అవకాశం. నిర్ణయాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్, బోనస్ లభిస్తాయి.
శుభ పరిహారం: అమ్మవారికి పులిహోర, గారెలు నైవేద్యం సమర్పించండి.
అనుకూల రంగు: ఎరుపు
అనుకూల సంఖ్య: 5

తులారాశి
గ్రహబలం చాలా అనుకూలం. తలపెట్టిన పనులు విజయవంతం. వ్యాపారులకు ధనలాభం, రియల్ ఎస్టేట్ లావాదేవీలు కలిసివస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలత.
శుభ పరిహారం: అమ్మవారి దర్శనం చేసుకోండి.
అనుకూల రంగు: కనకాంబరం రంగు
అనుకూల సంఖ్య: 5

వృశ్చికరాశి
గ్రహబలం అంతగా అనుకూలం కాదు. మానసిక ఆందోళన, దూర ప్రయాణాలు వాయిదా వేయండి. కుటుంబ వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త.
శుభ పరిహారం: శివారాధన, అమ్మవారిని తలుచుకోండి.
అనుకూల రంగు: నీలం
అనుకూల సంఖ్య: 6

ధనూరాశి
గ్రహబలం పాక్షికంగా అనుకూలం. పని ఒత్తిడి ఉన్నప్పటికీ వ్యాపారులకు లాభం. ఉద్యోగులకు అనుకోని శుభవార్తలు, నూతన అవకాశాలు.
శుభ పరిహారం: అమ్మవారి ఆరాధన మానసిక శాంతినిస్తుంది.
అనుకూల రంగు: లేత బంగారు రంగు
అనుకూల సంఖ్య: 6

మకరరాశి
గ్రహబలం అనుకూలం. భూ వివాదాలకు పరిష్కారం. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆధ్యాత్మికత, మానసిక ప్రశాంతత కలుగుతాయి.
శుభ పరిహారం: అమ్మవారి దర్శనం చేసుకోండి.
అనుకూల రంగు: గులాబీ
అనుకూల సంఖ్య: 5

కుంభరాశి
గ్రహబలం అంతగా అనుకూలం కాదు. పనులు నిదానంగా సాగుతాయి. ఖర్చులు అధికం. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్త. దూర ప్రయాణాలు వాయిదా వేయండి.
శుభ పరిహారం: ఆపదామపహర్తారం మంత్రం 18 సార్లు జపించి, తూర్పు వైపు తిరిగి 9 గుటకల నీరు తాగండి. అమ్మవారి దర్శనం శుభం.
అనుకూల రంగు: తెలుపు
అనుకూల సంఖ్య: 2

మీనరాశి
గ్రహబలం అనుకూలం. మిత్రుల సహాయంతో విజయం, ధనలాభం. దీర్ఘకాలిక పెట్టుబడి ఆలోచనలు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, విదేశీ వీసా శుభవార్తలు.
శుభ పరిహారం: అమ్మవారి దర్శనం చేసుకోండి.
అనుకూల రంగు: పసుపు
అనుకూల సంఖ్య: 6

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.