PM Kisan Yojana:దీపావళి సందర్భంగా ఏపీ రైతులకు శుభవార్త… పీఎం కిసాన్ యోజన నిధులు ఖాతాల్లో జమయ్యే అవకాశం!
PM Kisan Yojana:దీపావళి సందర్భంగా ఏపీ రైతులకు శుభవార్త… పీఎం కిసాన్ యోజన నిధులు ఖాతాల్లో జమయ్యే అవకాశం..కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా రైతులకు గుడ్ న్యూస్ అందించే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతలుగా పీఎం కిసాన్ యోజన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో, ఇప్పుడు చివరి విడతగా మరోసారి ఈ నిధులను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ యోజన కింద, త్వరలో 21వ విడత నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ పథకం ద్వారా రైతులకు ఏటా రూ. 6,000 మూడు విడతలుగా DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా అందజేస్తున్నారు. ఈ పథకం 2019 ఫిబ్రవరి 24న గోరఖ్‌పూర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతిలో మొదటి విడత విడుదలైంది, దీని కోసం రూ. 75,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు.
సాధారణంగా, పీఎం కిసాన్ యోజన నిధులు ప్రతి నాలుగు నెలలకు విడుదలవుతాయి. ఇటీవల 20వ విడత ఆగస్టు 2025లో విడుదలైంది. నాలుగు నెలలు గడిచిన తర్వాత, ఈసారి 21వ విడతను ఆలస్యం చేయకుండా విడుదల చేసే అవకాశం ఉందని అంచనా. అధికారిక తేదీ ఇంకా ప్రకటించలేదు, కానీ మీడియా వర్గాల ప్రకారం, దీపావళికి ముందు రూ. 2,000 రైతుల ఖాతాల్లో జమ కావచ్చు.
ఈ 21వ విడత అక్టోబర్ 2025 చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రైతులు తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి అధికారిక PM కిసాన్ వెబ్‌సైట్ pmkisan.gov.inని సందర్శించవచ్చు. ఈ క్రింది దశలను అనుసరించడం ద్వారా లబ్ధిదారుల జాబితాను తనిఖీ చేయవచ్చు:
ముందుగా, PM కిసాన్ వెబ్‌సైట్ pmkisan.gov.inని సందర్శించండి.
హోమ్ పేజీలో ‘బెనిఫిషియరీ జాబితా’ ఎంపికపై క్లిక్ చేయండి.
రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, గ్రామం వంటి వివరాలను నమోదు చేయండి.
అన్ని ఎంపికలు డ్రాప్-డౌన్ జాబితాలో అందుబాటులో ఉంటాయి, సరైన వివరాలను ఎంచుకోండి.
‘నివేదిక పొందండి’ బటన్‌పై క్లిక్ చేయండి.
ఇది మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను స్క్రీన్‌పై చూపిస్తుంది.
ఇక, పీఎం కిసాన్ యోజన ద్వారా రైతులకు ఏటా రూ. 6,000 అందగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రూ. 14,000 అందిస్తోంది. ఈ లెక్కన, ఏపీ రైతులు రెండు పథకాల ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏపీ రైతులకు మొత్తం రూ. 20,000 సహాయం అందనుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

