Today Horoscope:అక్టోబర్ 4 రాశి ఫలాలు.. ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి..
Today Horoscope:అక్టోబర్ 4 రాశి ఫలాలు.. ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి..అక్టోబర్ 4, 2025, శనివారం – ఆశ్వీయుజ మాసం, శుద్ధ ద్వాదశి, ధనిష్ట నక్షత్రం. ఈ రోజు దినసరి రాశి ఫలితాలు ఇలా ఉన్నాయి:
మేషం
అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. రావలసిన డబ్బులు కొంత ఆలస్యంగా అందుతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వస్తాయి. కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనం చేస్తారు. ఆఫీసు విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
వృషభం
పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. ఇల్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పనులను తొందరపడకుండా సమర్థవంతంగా పూర్తి చేయండి. శుభకార్యంలో కుటుంబంతో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం కొంత మెరుగవుతుంది. బంధువులతో చిన్నపాటి సమస్యలు రావచ్చు.
మిథునం
కెరీర్‌లో పురోగతి ఉంటుంది. ఆఫీసులో అనవసర వివాదాలు, రాజకీయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి. విదేశీ ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మనోబలం దృఢంగా ఉంచుకోండి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది.
కర్కాటకం
పనులను వాయిదా వేయకండి. పని ఒత్తిడి కొంత పెరుగుతుంది. భాగస్వామితో దైవ దర్శనం చేస్తారు. సహనం చాలా ముఖ్యం. వ్యాపార రీత్యా విదేశీ ప్రయాణ అవసరం రావచ్చు. కుటుంబ సహకారం అందుతుంది. అదనపు ఆదాయం కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు.
సింహం
జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. మీ మాట, తీరుతో సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. వ్యాపారులకు ఈ రోజు లాభదాయకం. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. స్నేహితులకు ఆర్థిక సహాయం అందిస్తారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. లక్ష్యాల సాధన కోసం పట్టుదలతో పని చేయండి. భాగస్వామితో మనస్పర్థలు తొలగిపోతాయి. దూర ప్రయాణాల్లో చిన్న ఇబ్బందులు రావచ్చు. ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన ఉండవచ్చు.
కన్య
భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఉద్యోగంలో పని ఆటంకాలు ఎదురవొచ్చు. వ్యాపార లావాదేవీలలో జాగ్రత్త అవసరం. లక్ష్యాల సాధనకు పట్టుదలతో ముందుకు సాగండి. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు మరింత కష్టపడాలి.
తుల
డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించండి. కొన్ని ప్రతికూల వార్తలు వినవచ్చు. సహోద్యోగులతో విభేదాలు రావొచ్చు. వ్యాపారంలో కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. ఇతరుల పనులతో పాటు మీ పనులపై కూడా దృష్టి పెట్టండి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో శుభవార్త వింటారు.
వృశ్చికం
ఖర్చులను నియంత్రించండి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది, డబ్బు ఆదా చేస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి కొంత పెరగవచ్చు. భాగస్వామితో గడిపే సమయం ప్రశాంతతనిస్తుంది. స్త్రీలు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలం. ప్రాపర్టీ కొనుగోలులో ఇతరుల సలహా తీసుకోండి.
ధనుస్సు
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారంలో అవకాశాలను జారవిడుచుకోకండి. ఉద్యోగంలో సమస్యలను తేలికగా తీసుకోండి. ముఖ్య నిర్ణయాల్లో శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కళారంగంలో వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. బంధువులతో ఆస్తి విషయాల్లో విభేదాలు తగ్గుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
మకరం
డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారులకు ఈ రోజు కొంత ప్రతికూలంగా ఉంటుంది. మహిళలకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి రావచ్చు. అతిథుల రాకతో ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ ఆలోచనలు ఇతరులకు కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు. పాత మిత్రులను కలిసే అవకాశం ఉంది.
కుంభం
అనవసర ఖర్చులను తగ్గించండి. రాజకీయ రంగంలో ఉన్నవారు మంచి పేరు సంపాదిస్తారు. కీలక విషయాల్లో పెద్దల సలహా పాటించండి. శుభవార్తలు వింటారు, మనోబలం పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. లక్ష్య సాధన కోసం కృషి కొనసాగించండి, విజయం సిద్ధిస్తుంది. ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
మీనం
ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. పెట్టుబడులు కలసివస్తాయి. దగ్గరి వ్యక్తులతో వివాదాలు రాకుండా చూసుకోండి. శుభవార్త వల్ల కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. సహోద్యోగుల నుండి సహకారం లభిస్తుంది. వ్యాపారం కోసం విదేశీ ప్రయాణాలు చేయవచ్చు. జీవితంలో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

