Gold Rate:దీపావళికి ముందు సంతోషకరమైన వార్త.. బంగారం ధరలు సగానికి తగ్గనున్నాయా?
Gold Rate:దీపావళికి ముందు సంతోషకరమైన వార్త.. బంగారం ధరలు సగానికి తగ్గనున్నాయా..ప్రస్తుతం ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో ఉన్న బంగారం ధరలు త్వరలో 44 శాతం వరకు పడిపోతాయని మార్కెట్ నిపుణుడు స్మిత్ తక్కర్ అంచనా వేశారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. ఈ వార్త బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త అయినప్పటికీ, బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం భారీ నష్టాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
భారతీయ మహిళలకు బంగారం, బంగారు ఆభరణాల పట్ల ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పండగలు, వివాహాలు, ఇతర శుభ సందర్భాల్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి ధరించడానికి వారు ఎంతో ఆసక్తి చూపిస్తారు. బంగారం వారి అందాన్ని మరింత పెంచడమే కాకుండా, సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుందని భావిస్తారు. అందుకే ఎక్కువ బంగారం ధరించాలని ఆరాటపడతారు. అలాగే, బంగారం కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా, పెట్టుబడికి కూడా అద్భుతమైన సాధనంగా ఉంటోంది. ఈ కారణంగానే ఇటీవలి కాలంలో బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది.
ప్రస్తుతం బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. తులం బంగారం కొనాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలంటేనే ఆందోళన కలిగే రోజులు వచ్చాయి. అయితే, ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదని, బంగారం ధర సగానికి తగ్గి, ప్రస్తుత ధర కంటే చాలా తక్కువకు లభ్యమవుతుందని స్మిత్ తక్కర్ అంచనా వేశారు.
ఆయన అంచనా ప్రకారం, బంగారం ధరలు 44 శాతం వరకు పడిపోయే అవకాశం ఉంది. అయితే, ఈ తగ్గుదల ఎప్పటి వరకు జరుగుతుందనేది ఆయన స్పష్టంగా తెలపలేదు. దీపావళికి ముందు ఇంత భారీ తగ్గుదల వార్త వినడం ఆనందంగా ఉన్నప్పటికీ, బంగారంలో ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వారికి ఈ తగ్గుదల భారీ నష్టాలను తెచ్చిపెట్టవచ్చని సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంలో పెట్టుబడి పెట్టడం సమంజసం కాదని స్మిత్ తక్కర్ సూచిస్తున్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు బంగారం ధర తగ్గడానికి కీలక కారణాలని ఆయన విశ్లేషించారు. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ రిస్క్‌లను గమనించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

