Today Horoscope:సెప్టెంబర్ 5 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ అదృష్టం కలిసి వస్తుంది..
Today Horoscope:సెప్టెంబర్ 5 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ అదృష్టం కలిసి వస్తుంది.. ఈ రోజుల్లో జాతకాలను ఎక్కువగా నమ్ముతున్నారు. జాతకాలను కొంత వరకు నమ్మవచ్చు.
మేషం
మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్యహృదయం చదవాలి.
వృషభం
ప్రారంభించిన పనులు సులభంగా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు ప్రశంసిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ శుభదాయకం.
మిథునం
మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుప్రీతి ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.
కర్కాటకం
ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వాదాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం కనిపిస్తోంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
సింహం
ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల ఇళ్లలో సుఖభోజనం చేస్తారు. కీలక విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇష్టదైవ నామస్మరణ మంచిది.
కన్య
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి నుంచి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి.
తుల
ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మేలైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సంబంధ విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
వృశ్చికం
శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
ధనుస్సు
శుభకాలం. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతారాధన శుభప్రదం.
మకరం
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభదాయకం.
కుంభం
మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో అధికారుల నుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి. అర్థ, వస్త్ర లాభాలు ఉన్నాయి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.
మీనం
మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

