Daily Horoscope:అక్టోబర్ 6 రాశి ఫలాలు.. ఈ రాశి వారు అప్పుల విషయంలో జాగ్రత్త..
Daily Horoscope:అక్టోబర్ 6 రాశి ఫలాలు.. ఈ రాశి వారు అప్పుల విషయంలో జాగ్రత్త.. ఈ మధ్య కాలంలో జాతకాలను ఎక్కువగా నమ్ముతున్నారు. అయితే కొంత మంది అసలు జాతకాలను నమ్మరు. అయితే ఇది జాతకాలను నమ్మే వారి కోసం మాత్రమే..
06 అక్టోబర్ 2025 – సోమవారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం
తిథి: చతుర్దశి మ. 12:20 వరకు, తరువాత పౌర్ణమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర తె. 3:51+ వరకు, తరువాత రేవతి
వర్జ్యం: మ. 2:58 నుండి సా. 4:25 వరకు
దుర్ముహూర్తం: మ. 12:27 నుండి మ. 1:14 వరకు, మ. 2:48 నుండి మ. 3:36 వరకు
రాహుకాలం: ఉ. 7:40 నుండి ఉ. 9:06 వరకు
యమగండం: ఉ. 10:35 నుండి మ. 12:04 వరకు
బ్రహ్మ ముహూర్తం: తె. 4:35 నుండి తె. 5:21 వరకు
అమృత ఘడియలు: రా. 11:18 నుండి రా. 12:45 వరకు
(నోట్: “+” అనగా మరుసటి రోజు)
మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల దిన ఫలాలు ఈ రోజు ఇలా ఉన్నాయి:
మేషరాశి:
ఈ రోజు గ్రహబలం పాక్షికంగా అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు పనిలో ఒత్తిడి కనిపిస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగవచ్చు. అయితే, మధ్యాహ్నం నుండి పరిస్థితులు మెరుగవుతాయి, అనుకోని ధనలాభం సంభవం. దూర ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి, అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం, శివారాధన శుభ ఫలితాలనిస్తాయి.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 6
వృషభరాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఆకస్మిక ధనలాభం, బంగారం కొనుగోలు లేదా పెట్టుబడులకు అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పణ శుభం కలిగిస్తుంది.
లక్కీ కలర్: బంగారు వర్ణం
లక్కీ నెంబర్: 9
మిథునరాశి:
గ్రహబలం అద్భుతంగా అనుకూలంగా ఉంది. మానసిక ఉల్లాసం, ఉద్యోగులకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు గణనీయమైన లాభాలు. దూర ప్రయాణాలు, ఒప్పందాలు శుభప్రదంగా ఉంటాయి. అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.
లక్కీ కలర్: గంధం రంగు
లక్కీ నెంబర్: 6
కర్కాటకరాశి:
గ్రహబలం పూర్తిగా అనుకూలంగా లేదు. సన్నిహితులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. పనుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం. హామీలపై సంతకాలు, స్థిరాస్తి కొనుగోళ్లు 3 రోజులు వాయిదా వేయండి. వ్యాపారులకు ఆశించిన లాభాలు వస్తాయి. ముక్కంటి ఆరాధన ఇబ్బందులను తొలగిస్తుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 6
సింహరాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. శని ప్రభావం ఉన్నప్పటికీ, కుజుడి శుభత్వం వల్ల పనులు విజయవంతం అవుతాయి. మానసికంగా కొంత అస్థిరత ఉండవచ్చు. ధనలాభం సంభవం. ఉద్యోగులు పనిపై దృష్టి పెట్టి, అధికారులను సంతోషపెట్టండి. శివారాధన శుభ ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: నీలం
లక్కీ నెంబర్: 9
కన్యారాశి:
గ్రహబలం సానుకూలంగా ఉంది. అనుకోని శుభ సంఘటనలు జరుగుతాయి. మానసిక ఒత్తిడి తగ్గి, ఆర్థిక లాభాలు అప్రయత్నంగా వస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు రాకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగులకు అనుకూలమైన రోజు. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
లక్కీ కలర్: పచ్చ
లక్కీ నెంబర్: 5
తులారాశి:
రవి, శుక్రుల అనుకూలత వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం, ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలు శుభప్రదం. శత్రు జయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. పంచముఖి ఆంజనేయస్వామి ఆరాధన శుభం కలిగిస్తుంది.
లక్కీ కలర్: కాషాయం
లక్కీ నెంబర్: 9
వృశ్చికరాశి:
గ్రహబలం కొంత తక్కువగా ఉంది. ఆరోగ్యం, పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పెద్ద పెట్టుబడులు, ఒప్పందాలలో జాగ్రత్త వహించండి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత తక్కువ. వ్యాపారులకు శ్రమ ఎక్కువ, లాభాలు తక్కువగా ఉంటాయి. విష్ణు సహస్రనామ పారాయణ శుభ ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 3
ధనూరాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది, కానీ శని ప్రభావం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టండి, మాటలు తగ్గించండి. జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు నివారించండి. ఆర్థికంగా అనుకూలం, బాకీల విషయంలో అప్రమత్తంగా ఉండండి. వ్యాపారులకు శ్రమతో లాభాలు వస్తాయి. స్త్రీలకు శుభ ఫలితాలు. అమ్మవారి ఆరాధన ఇబ్బందులను తొలగిస్తుంది.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 9
మకరరాశి:
గ్రహబలం సానుకూలంగా ఉంది. అప్రయత్న లాభాలు, పెట్టుబడులకు అనుకూలం. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు శుభప్రదం. ఉద్యోగులకు మానసిక ఆందోళన ఉండవచ్చు. వ్యాపారులకు పని ఒత్తిడితో ఆర్థిక లాభాలు వస్తాయి. ఈశ్వరారాధన కలిసివస్తుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 1
కుంభరాశి:
గ్రహబలం పూర్తిగా అనుకూలంగా లేదు, కానీ గురుబలం మాటకు విలువనిస్తుంది. పనుల్లో కొంత విజయం కనిపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉండటంతో ఆదాయం నిలవదు. వ్యాపారులు, ఉద్యోగులు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. హనుమాన్ చాలీసా పఠనం మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది.
లక్కీ కలర్: కాషాయం
లక్కీ నెంబర్: 3
మీనరాశి:
గ్రహబలం సామాన్యంగా ఉంది. కేతు అనుకూలమైనప్పటికీ, పని ఒత్తిడి, చిరాకు ఎక్కువగా ఉంటాయి. మాటల్లో నియంత్రణ అవసరం. ఆర్థికంగా పరవాలేదు. ఉద్యోగులకు పని ఒత్తిడి, వ్యాపారులకు శ్రమతో లాభాలు వస్తాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం కాదు. అమ్మవారి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 5
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

