Daily Horoscope:అక్టోబర్ 7 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ అనుకోని అదృష్టం..
Daily Horoscope:అక్టోబర్ 7 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ అనుకోని అదృష్టం.. ఈ మధ్య కాలంలో రాశి ఫలాలను చూసుకొని దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.
07 అక్టోబర్ 2025 – మంగళవారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం
తిథి: పౌర్ణమి ఉదయం 9:15 వరకు, తరువాత పాడ్యమి తెల్లవారుజాము 5:51+ వరకు
నక్షత్రం: రేవతి రాత్రి 1:27+ వరకు, తరువాత అశ్విని
వర్జ్యం: మధ్యాహ్నం 2:43 నుండి సాయంత్రం 4:10 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 8:31 నుండి 9:19 వరకు, రాత్రి 10:50 నుండి 11:39 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 4:27 వరకు
యమగండం: ఉదయం 9:07 నుండి 10:35 వరకు
బ్రహ్మముహూర్తం: తెల్లవారుజాము 4:35 నుండి 5:23 వరకు
అమృత ఘడియలు: రాత్రి 11:18 నుండి 12:44 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:27 వరకు
(నోట్: “+” అనగా మరుసటి రోజు)
మేషం నుండి మీనం వరకు ఈ రోజు రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి:
మేషం:
ఈ రోజు గ్రహాలు పాక్షికంగా అనుకూలం. పనుల్లో కొంత ఆలస్యం జరిగే అవకాశం. వ్యాపారులకు కొంచెం శ్రమ ఉన్నప్పటికీ, ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. ఉద్యోగులకు అనుకూల రోజు, కార్యాలయంలో ఉత్సాహపూరిత వాతావరణం ఉంటుంది. తూర్పు దిశలో ప్రయాణాలు శుభప్రదం. వ్యాపార ఒప్పందాలకు మంచి సమయం. విష్ణు సహస్రనామం జపించడం వల్ల శుభం కలుగుతుంది.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 6
వృషభం:
గ్రహబలం అనుకూలంగా ఉంది, శుభ సంఘటనలు జరిగే అవకాశం. ఆర్థికంగా లాభం ఉంటుంది. గురుబలం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులకు కొత్త అవకాశం, పదవీ యోగం కనిపిస్తుంది. వ్యాపారులకు నూతన పెట్టుబడులకు అనుకూల సమయం. మాటలో నియంత్రణ అవసరం. వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించండి.
లక్కీ కలర్: లేత గంధం
లక్కీ నెంబర్: 9
మిథునం:
గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఎప్పటినుండో ఉన్న సమస్య నుండి విముక్తి, మనసు తేలికవుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం. ఒక వ్యక్తితో సంబంధాలు తెంచుకునే నిర్ణయం తీసుకుంటారు. కొత్త ప్రణాళికలు, ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. లక్ష్మీనరసింహ స్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలు.
లక్కీ కలర్: పచ్చ
లక్కీ నెంబర్: 7
కర్కాటకం:
ఈ రోజు గ్రహబలం పెద్దగా అనుకూలం కాదు. ఆర్థిక ఇబ్బందులు, సన్నిహితులతో వివాదాలు రావచ్చు. మాటలో అదుపు అవసరం. అసూయ, ద్వేషాలు మీకే హాని చేస్తాయి. ఆర్థిక నిర్ణయాలు వాయిదా వేయండి. అమ్మవారి ప్రార్థన శుభ ఫలితాలను ఇస్తుంది.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 9
సింహం:
గ్రహబలం అనుకూలంగా ఉంది, పనుల్లో విజయం సాధ్యం. మానసిక ఆందోళన ఉన్నప్పటికీ, వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. పెట్టుబడులు, స్టాక్ మార్కెట్‌కు అనుకూలం. వ్యాపారులకు లాభాలు, ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. శివారాధన శుభప్రదం.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 9
కన్య:
గ్రహబలం అనుకూలం, పనుల్లో విజయం, మాటకు గౌరవం లభిస్తుంది. ఆర్థికంగా శుభకాలం. పెద్ద సమస్య నుండి విముక్తి. ముఖ్య నిర్ణయాలకు ఈ రోజు అనుకూలం. నూతన పెట్టుబడులు, వాహన లాభం సాధ్యం. గణపతి ఆరాధన శుభం.
లక్కీ కలర్: పచ్చ
లక్కీ నెంబర్: 3
తుల:
గ్రహబలం అద్భుతంగా ఉంది. మాటలో అదుపు ఉంటే విజయం ఖాయం. ఆర్థిక లాభాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. కమొడిటీ పెట్టుబడులు, వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశం. దక్షిణ దిశ ప్రయాణాలు శుభం. హనుమంతుడికి ఆకుపూజ చేయించండి.
లక్కీ కలర్: బంగారు వర్ణం
లక్కీ నెంబర్: 9
వృశ్చికం:
గ్రహబలం అనుకూలత తక్కువగా ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక ఖర్చులు అదుపులో ఉంచుకోండి. వ్యాపారులు టాక్స్ విషయాల్లో జాగ్రత్త. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. శివారాధన శుభ ఫలితాలను ఇస్తుంది.
లక్కీ కలర్: లేత నీలం
లక్కీ నెంబర్: 3
ధనస్సు:
గ్రహబలం చాలా అనుకూలం. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి, సహనం అవసరం. మానసిక ఆందోళన సామాజిక సంబంధాలపై ప్రభావం చూపకుండా జాగ్రత్త. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త, ఖర్చులు అదుపులో ఉంచండి. అమ్మవారి ఆరాధన శుభం.
లక్కీ కలర్: మెరూన్
లక్కీ నెంబర్: 6
మకరం:
గ్రహబలం చాలా అనుకూలం. అనుకోని శుభాలు, లాభాలు కలిగే సమయం. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారులకు అప్రయత్నంగా ఆదాయం. ఉద్యోగులకు పని ఒత్తిడి. రియల్ ఎస్టేట్‌కు శుభం. శివ దర్శనం, ఆవునేతి దీపారాధన మంచిది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 3
కుంభం:
గ్రహబలం అనుకూలం కాదు. వృత్తి, ఉద్యోగాలు నీరసంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు, జీవిత భాగస్వామితో చిన్న వివాదాలు రావచ్చు. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ముక్కంటికి పాలాభిషేకం చేయించండి.
లక్కీ కలర్: నీలం
లక్కీ నెంబర్: 3
మీనం:
గ్రహబలం అనుకూలం కాదు. ఆవేశాలకు లోను కాకుండా జాగ్రత్త. డ్రైవింగ్‌లో శ్రద్ధ అవసరం. పెట్టుబడులు, స్పెక్యులేషన్‌లకు అనుకూలం కాదు. వ్యాపారులకు సహనం, ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అమ్మవారికి కుంకుమ పూజ ఇబ్బందులను తొలగిస్తుంది.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 5
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

