Hair Care Tips:జుట్టు ఎంత పల్చగా ఉన్నా ఇలా చేస్తే చాలు.. కేవలం 2 నెలల్లో ఒత్తుగా మారుతుంది..
Hair Care Tips:జుట్టు ఎంత పల్చగా ఉన్నా ఇలా చేస్తే చాలు.. కేవలం 2 నెలల్లో ఒత్తుగా మారుతుంది.. కొందరి జుట్టు చాలా పల్చగా మారుతుంది. దీనికి అధిక జుట్టు రాలడం (Hairfall) ఒక కారణం అయితే, జుట్టు ఎదుగుదల లేకపోవడం మరొక కారణం. పల్చటి జుట్టును మళ్లీ ఒత్తుగా మార్చడానికి చాలామంది వివిధ ప్రయోగాలు చేస్తుంటారు.
మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా? అయితే, ఇప్పుడు చెప్పబోయే ఇంట్లో తయారు చేసే హెయిర్ టానిక్‌ను ఖచ్చితంగా ప్రయత్నించండి. ఈ టానిక్‌ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే, ఎంత పల్చటి జుట్టు అయినా కేవలం రెండు నెలల్లో ఒత్తుగా మారడం ఖాయం.
దీని కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని, అందులో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం, ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు, ఒక టేబుల్ స్పూన్ ఎండిన రోజ్‌మేరీ ఆకులు వేసి, ఒక గ్లాసు నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి, ఈ నానబెట్టిన మిశ్రమాన్ని గిన్నెలో వేసి, చిన్న మంటపై సుమారు 10 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆపి, స్ట్రైనర్ సహాయంతో నీటిని వడకట్టి చల్లారబెట్టాలి.
ఈ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత, అందులో ఒక టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ కలపండి. ఇప్పుడు మీ హెయిర్ టానిక్ సిద్ధం! ఈ టానిక్‌ను స్కాల్ప్‌తో సహా జుట్టు మొత్తానికి వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేసి, మంచిగా మసాజ్ చేయండి. టానిక్ వేసిన ఒక గంట తర్వాత, తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రంగా కడగాలి.
వారానికి ఒకసారి ఈ టానిక్‌ను ఉపయోగిస్తే, జుట్టు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందుతాయి. జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి, జుట్టు రాలడం తగ్గుతుంది, కొత్త జుట్టు ఎదుగుదల ప్రారంభమవుతుంది, మరియు పల్చటి జుట్టు కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుతుంది. అంతేకాక, ఈ టానిక్ చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

