Business

Gold Rate Today:భారీగా తగ్గుతున్న బంగారం,వెండి ధరలు.. కొనటానికి మంచి సమయం..?

Gold Rate Today:భారీగా తగ్గుతున్న బంగారం,వెండి ధరలు.. కొనటానికి మంచి సమయం..బంగారం ధరలు భారీగా తగ్గాయి… అక్టోబర్ 28, 2025 మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి… 10 గ్రాముల బంగారం ధర రూ. 10,000 తగ్గింది..నిన్నటితో పోలిస్తే నీటి రోజు బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. అక్టోబర్ 28, 2025 మంగళవారం నాడు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,180గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,500గా, ఒక కిలో వెండి ధర రూ. 1,47,000గా ఉంది.

బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో ఏర్పడిన మార్పులని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర భారీగా తగ్గి, ఒక దశలో రూ. 4,396 డాలర్ల నుంచి రూ. 400 డాలర్లు పడిపోయి, ప్రస్తుతం రూ. 3,980 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ గురువారం సమావేశం కానున్న నేపథ్యంలో, అమెరికా చైనా నుంచి దిగుమతి సుంకాల పెంపు వాయిదా, చైనా రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతుల నియంత్రణ సడలింపు వంటి అంశాలు మార్కెట్‌కు సానుకూల సంకేతాలను అందించాయి.

ఈ ఏడాది ఆగస్టు నుంచి బంగారం ధరలు 25% పెరిగాయి. క్యాపిటల్ ఎకనామిక్స్ సంస్థ అంచనా ప్రకారం, 2026 చివరి నాటికి ఒక ఔన్స్ బంగారం ధర రూ. 3,500 డాలర్లకు తగ్గవచ్చని సీఎన్బీసీ బిజినెస్ వెబ్ పోర్టల్ తెలిపింది. ఒకవేళ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే, బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వెండి ధర కూడా గణనీయంగా తగ్గి, ప్రస్తుతం ఒక కిలో వెండి ధర రూ. 1.40 లక్షలుగా ఉంది. ఒక దశలో రూ. 2 లక్షల వరకు పలికిన వెండి ధర ఇప్పుడు భారీగా పడిపోయింది. ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకోవడమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.బంగారం ధరల తగ్గుదలతో ఆభరణాల కొనుగోలుదారులకు ఊరట లభించింది. ధరలు తక్కువగా ఉన్నప్పుడే బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలని వినియోగదారులు ఆశిస్తున్నారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.