Vastu Tips:కర్పూరంతో ఈ పరిహారాలు చేస్తే జీవితంలో డబ్బుకు లోటు రాదు..
Vastu Tips:కర్పూరంతో ఈ పరిహారాలు చేస్తే జీవితంలో డబ్బుకు లోటు రాదు..హిందూ పూజల్లో కర్పూరానికి ప్రత్యేక స్థానం ఉంది. పూజను కర్పూర హారతితో పూర్తి చేస్తారు. వాస్తు శాస్త్రంలోనూ కర్పూరం అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. ఇంటి వాస్తు దోషాలను సరిచేసే శక్తి కర్పూరానికి ఉందని నమ్మకం. ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇవాళ కర్పూరంతో చేసే కొన్ని సులభమైన పరిహారాల గురించి తెలుసుకుందాం..
వాస్తు సూత్రాలు పాటిస్తే జీవితంలోని చాలా సమస్యలు తీరతాయి. కర్పూరం ప్రతికూలతను దూరం చేసి, సానుకూలతను తెస్తుంది. ఇంటి సమస్యలను పరిష్కరించే అద్భుత సాధనం ఇది.
పనులు పదే పదే విఫలమవుతున్నా, ఇంట్లో అశాంతి ఉన్నా.. కారణం ప్రతికూల శక్తి కావచ్చు. ఉదయం, సాయంత్రం కర్పూరం వెలిగిస్తే వాతావరణం శుద్ధి అవుతుంది. సానుకూల శక్తి పెరుగుతుంది.
ఆర్థిక ఇబ్బందులు ఉంటే.. పూజ సమయంలో కర్పూరంలో ఒకటి లేదా రెండు లవంగాలు వేసి కాల్చండి. ఆర్థిక అడ్డంకులు తొలగి, అదృష్టం కలిసివస్తుంది.
వాస్తు దోషాలు తొలగించాలంటే.. ఇంటి మూలల్లో చిన్న కర్పూరం ముక్కలు పెట్టండి. కరిగిపోతే కొత్తవి మార్చండి. క్రమంగా ప్రతికూలత తొలగి, శాంతి నిండుతుంది.
ప్రధాన ద్వారం, పూజ గది, సేఫ్ దగ్గర కర్పూరం ఉంచితే శుభం. సానుకూల శక్తి నిండి, ఆర్థిక స్థితి బలపడుతుంది.
భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే.. బెడ్‌రూమ్‌లో కర్పూరం ముక్క పెట్టండి. దిండు కింద ఉంచితే మనసు ప్రశాంతంగా, నిద్ర బాగా పడుతుంది.ఒక గిన్నెలో నీళ్లు, కర్పూరం కలిపి పెట్టండి. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. స్ప్రే బాటిల్‌లో కర్పూరం, గులాబ్ జలం, నీళ్లు కలిపి ఇంట్లో స్ప్రే చేస్తే గాలి తాజాగా, మనసు శాంతంగా ఉంటుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

