WhatsApp:వాట్సప్‌లో నంబర్ సేవ్ చేయకుండానే కాల్ చేయడం ఎలా? స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్!
WhatsApp:వాట్సప్‌లో నంబర్ సేవ్ చేయకుండానే కాల్ చేయడం ఎలా? స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్..వాట్సప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ఉంటుంది. తాజాగా, వాట్సప్‌లో కాల్ డయలర్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా నంబర్ సేవ్ చేయకుండానే నేరుగా వాట్సప్ కాల్ చేయవచ్చు.
అంతేకాకుండా, ఈ ఫీచర్ సహాయంతో ఒక నంబర్ వాట్సప్‌లో రిజిస్టర్ అయి ఉందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. అనవసరమైన నంబర్లను ఫోన్లో సేవ్ చేయకుండా వాట్సప్ కాల్ చేయడానికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరం.
నంబర్ సేవ్ చేయకుండా వాట్సప్ కాల్ చేసే స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదీ:
మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ యాప్‌ను ఓపెన్ చేయండి.
స్క్రీన్ దిగువన ఉన్న ‘Calls’ సెక్షన్‌పై క్లిక్ చేయండి.
కుడి ఎగువ మూలలో కనిపించే ‘+’ (ప్లస్) ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
అక్కడ నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి:
New Call Link (న్యూ కాల్ లింక్)
Call a Number (కాల్ నంబర్)
New Contact (న్యూ కాంటాక్ట్)
Schedule Call (షెడ్యూల్ కాల్)
‘Call a Number’ ఆప్షన్‌ను ఎంచుకోండి. ఇది డయలర్ ప్యాడ్‌ను ఓపెన్ చేస్తుంది.
డయలర్ ప్యాడ్‌లో మీరు కాల్ చేయాలనుకున్న నంబర్‌ను ఎంటర్ చేసి, నేరుగా కాల్ చేయవచ్చు.
అదనంగా, ‘Schedule Call’ ఆప్షన్ ద్వారా మీరు నిర్దిష్ట సమయంలో వాట్సప్ కాల్‌ను షెడ్యూల్ చేయవచ్చు.
గమనిక: ఈ ఫీచర్ ప్రస్తుతం ఐఓఎస్ (ఐఫోన్) యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

