Business

Silver Rate:వెండి ధరలు గణనీయంగా పడిపోతున్నాయి… ఇప్పుడు సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం లాభదాయకమా? కాదా?

Silver Rate:వెండి ధరలు గణనీయంగా పడిపోతున్నాయి… ఇప్పుడు సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం లాభదాయకమా? కాదా..ప్రస్తుత వెండి ధరల విషయానికొస్తే, అక్టోబర్ 28న ఒక కేజీ వెండి ధర ₹1.54 లక్షలకు పడిపోయింది. దీనివల్ల గత కొద్ది రోజుల్లోనే దాదాపు ₹50,000 వరకు తగ్గిందని గమనించవచ్చు. ఈ భారీ పతనానికి ప్రధాన కారణం టెక్నికల్ కరెక్షన్ అని నిపుణులు అంటున్నారు. మార్కెట్ స్పెక్యులేషన్ వల్ల వెండి ధరలు అమాంతం పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు టెక్నికల్ కరెక్షన్ కారణంగా ధరలు క్రమంగా తగ్గుతున్నాయి.

ఈ ఏడాది వెండి ధరలు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆకాశాన్నంటాయి. అక్టోబర్‌లోనే ఒక కేజీ వెండి ₹2 లక్షల ఆల్-టైమ్ రికార్డును తాకింది. అయితే ఆ స్థాయి నుంచి ధరలు క్రమంగా కరగడం మొదలయింది. ఒక దశలో ప్రతి రోజూ ₹10,000 చొప్పున పెరిగిన ధరలు ఇప్పుడు తగ్గుతున్నాయి.

సిల్వర్ పెట్టుబడులకు ప్రధాన మార్గం సిల్వర్ ఈటీఎఫ్‌లు. ఈ ఏడాది ఈటీఎఫ్‌లు 80-100% వరకు రాబడిని ఇచ్చాయని ఈక్విటీ మాస్టర్ వెబ్‌సైట్ తెలిపింది. ఉదాహరణకు, నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ ఆస్తులు ₹10,000 కోట్లు దాటాయని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. దీంతో సిల్వర్ ఈటీఎఫ్‌లకు డిమాండ్ ఎంతగా పెరిగిందో అర్థమవుతుంది.

అయితే సిల్వర్ ఈటీఎఫ్‌లు దీర్ఘకాలిక పెట్టుబడులు. ప్రస్తుత కరెక్షన్ వల్ల తాత్కాలికంగా నష్టాలు కలిగినా, భవిష్యత్తులో సిల్వర్ రంగ వృద్ధి అవకాశాల వల్ల మంచి రాబడి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా SIP రూపంలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో చక్కటి లాభాలు సాధ్యమని సూచిస్తున్నారు. కానీ ఈటీఎఫ్‌లు రిస్క్-ఫ్రీ కావని గమనించాలి. మొత్తం పోర్ట్‌ఫోలియోలో కేవలం 10% వరకు మాత్రమే సిల్వర్ ఈటీఎఫ్‌లను ఉంచితే సమతుల్యత నిలబడుతుందని నిపుణుల సలహా.

డిస్‌క్లైమర్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీ పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు chaipakodi ఎలాంటి బాధ్యత వహించదు. పెట్టుబడి నిర్ణయాల ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారును సంప్రదించండి.