BusinessToday gold rate

Gold Rate Today:గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయో చూడండి..

Gold Rate Today:గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయో చూడండి.. బంగారం ధరలు భారీగా క్షీణించాయి. నిన్నటి ధరలతో పోల్చితే నేడు పసిడి ధరలు గణనీయంగా పడిపోయాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. ఆల్ టైం హై అయిన రూ.1.32 లక్షల నుంచి బంగారం ధరలు క్రమంగా క్షీణిస్తున్నాయి.

ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,370గా ఉంది. ఒక తులం (11.664 గ్రాములు) బంగారం ధర రూ.1,37,520గా నమోదైంది. 22 క్యారెట్ 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,12,650గా ఉంది. మరోవైపు, ఒక కేజీ వెండి ధర రూ.1,48,300గా ఉంది.

బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి నెమ్మదిగా తగ్గుతున్నాయి. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు. అమెరికాలో ఒక ఔన్స్ (31.2 గ్రాములు) బంగారం ధర అక్టోబర్‌లోనే 4,396 డాలర్లతో ఆల్ టైం రికార్డు స్థాయిని తాకింది. ప్రస్తుతం అది 3,970 డాలర్లకు పడిపోయింది – అంటే దాదాపు 426 డాలర్లకు పైగా తగ్గింది.

ఈ తగ్గుదలకు అమెరికా స్టాక్ మార్కెట్లు బలోపేతం కావడం, డాలర్ విలువ పెరగడం ప్రధాన కారణాలు. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం, రేర్ ఎర్త్ మెటల్స్ ఒప్పందం సమీపిస్తుండటంతో ఇన్వెస్టర్లు బంగారం నుంచి స్టాక్ మార్కెట్ల వైపు మళ్లుతున్నారు. అంతేకాకుండా, లాభాల బుకింగ్ కూడా ధరల తగ్గుదలకు దోహదపడుతోంది.

వెండి ధరల్లోనూ భారీ క్షీణత నమోదైంది. ఆల్ టైం హై రూ.2 లక్షల నుంచి ప్రస్తుతం రూ.1.50 లక్షల దిగువకు చేరింది – దాదాపు 25 శాతం తగ్గింది. ఇది స్పెక్యులేటివ్ ట్రేడింగ్ వల్ల వచ్చిన ర్యాలీకి టెక్నికల్ కరెక్షన్ మాత్రమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో వెండి ధర మరింత తగ్గే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.