Face Glow Tips:రాత్రి పడుకొనే ముందు ఇలా చేస్తే.. ముఖంపై ముడతలు, డార్క్ సర్కిల్స్ మాయమవుతాయి!
Face Glow Tips:రాత్రి పడుకొనే ముందు ఇలా చేస్తే.. ముఖంపై ముడతలు, డార్క్ సర్కిల్స్ మాయమవుతాయి.. పడుకునే ముందు కొద్దిగా బంగాళదుంప రసాన్ని ముఖానికి రాసి, 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మీ ముఖం యవ్వనవంతంగా మెరిసిపోతుంది.
అందం పెంచుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దాని కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టి క్రీములు కొని ముఖానికి పూసుకుంటాం. కానీ, ఆ క్రీములు లేకుండానే సహజంగా అందాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలు, నిద్ర లేకపోవడంతో ఏర్పడే డార్క్ సర్కిల్స్‌ను సులభంగా తొలగించవచ్చు. దానికి ఒక్క బంగాళదుంపే చాలు! ఇప్పుడు దాన్ని ఎలా వాడాలో చూద్దాం.
బంగాళదుంపతో ఫేస్ మాస్క్
కావలసిన పదార్థాలు:
మీడియం సైజు బంగాళదుంప – 1
దానిమ్మ గింజలు – ¼ కప్పు
పచ్చి పాలు – కొద్దిగా
నిమ్మరసం – (జిడ్డు చర్మం ఉన్నవారికి మాత్రమే)
తయారీ విధానం:
ముందుగా బంగాళదుంపను శుభ్రంగా కడిగి, పై తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసుకోండి. ఈ ముక్కలను దానిమ్మ గింజలతో కలిపి మిక్సీలో మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయండి. ఈ పేస్ట్‌లో పచ్చి పాలు కలపండి. ఒకవేళ మీ చర్మం జిడ్డుగా ఉంటే కొద్దిగా నిమ్మరసం జోడించండి. ఈ మిశ్రమాన్ని అరగంటసేపు ఫ్రిజ్‌లో చల్లబరచండి. తర్వాత ముఖం మీద సమానంగా అప్లై చేసి, సర్కిల్ రూపంలో మసాజ్ చేయండి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.
వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే ముఖం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. బంగాళదుంపలోని సహజ ఎంజైమ్‌లు చనిపోయిన చర్మ కణాలను తొలగించి, చర్మాన్ని యవ్వనవంతంగా మారుస్తాయి.
బంగాళదుంప రసం
పడుకునే ముందు బంగాళదుంపను రుబ్బి రసం తీసుకోండి. ఈ రసాన్ని కాటన్ ప్యాడ్‌తో ముఖం మీద రాయండి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయండి. ప్రతిరోజూ ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ క్రమంగా తగ్గి, ముఖం సహజ మెరుపుతో కళకళలాడుతుంది. ఇది అందాన్ని పెంచడమే కాకుండా, చర్మానికి చల్లదనం ఇచ్చి మంచి నిద్రకు కూడా దోహదపడుతుంది.
నిపుణుల సలహా
బ్యూటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగాళదుంపలోని సహజ ఆమ్లాలు (కాటెకోలేస్, కోజిక్ ఆసిడ్ వంటివి) చర్మానికి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా పనిచేస్తాయి. అన్ని వయసుల వారు సురక్షితంగా ఉపయోగించవచ్చు. కెమికల్స్ లేకపోవడం వల్ల చర్మానికి హాని ఉండదు. అయితే, సెన్సిటివ్ చర్మం ఉన్నవారు ముందుగా చిన్న ప్యాచ్ టెస్ట్ చేసి వాడటం మంచిది.

