Gold rate today:పసిడి ప్రియులకు శుభవార్త.. జారుడుతున్న బంగారం ధరలు… అక్టోబర్ 31, శుక్రవారం గోల్డ్ రేట్లు ఇవిగో!
Gold rate today:పసిడి ప్రియులకు శుభవార్త.. జారుడుతున్న బంగారం ధరలు… అక్టోబర్ 31, శుక్రవారం గోల్డ్ రేట్లు ఇవిగో..నిన్నటితో పోల్చితే ఈ రోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అయినా, ఆల్-టైమ్ రికార్డు స్థాయితో పోలిస్తే దాదాపు 10 వేల రూపాయలు తక్కువగానే వ్యాపారం జరుగుతోంది. అక్టోబర్ 31, శుక్రవారం ధరలు ఇలా ఉన్నాయి:
24 క్యారెట్ 10 గ్రాముల బంగారం: ₹1,24,407
22 క్యారెట్ 10 గ్రాముల బంగారం: ₹1,11,750
ఒక కేజీ వెండి: ₹1,53,000
బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులే ప్రధాన కారణం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించినా, డే ట్రేడింగ్‌లో ధరలు క్షీణించాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా ప్రకారం మరింత తగ్గుదల సాధ్యమే. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం, డాలర్ విలువ పెరుగుదల కూడా దీనికి దోహదం చేస్తున్నాయి.మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, ఓవర్‌బాట్ పొజిషన్‌కు చేరుకోవడం వంటి అంశాలు కూడా ధరల క్షీణతకు కారణాలు. డాలర్ బలోపేతమవుతుంటే బంగారం ధర పడిపోతుంది. అంతర్జాతీయ రాజకీయ, వాణిజ్య స్థిరత్వం కొనసాగితే ఈ కరెక్షన్ మరింత లోతుగా వెళ్లవచ్చు.
ఇన్వెస్టర్లు బంగారాన్ని సేఫ్ హెవెన్‌గా చూస్తున్నారు కానీ, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ గణనీయంగా పడిపోయింది. గత దీపావళితో పోల్చితే ఈ ఏడాది సేల్స్ భారీగా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుత తగ్గుదలతో మళ్లీ కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.
వెండి ధరలు కూడా గణనీయంగా క్షీణించాయి. ఒక దశలో ₹2 లక్షలకు చేరిన ఒక కేజీ వెండి ఇప్పుడు దాదాపు 50 వేల రూపాయలు తగ్గింది. ఈ కరెక్షన్ ఎంతవరకు కొనసాగుతుందో వేచి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

