karthika pournami 2025:ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది.. నవంబర్ 4న, 5న?.. 365 వత్తులు ఎలా వెలిగించాలి..
karthika pournami 2025:ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది.. నవంబర్ 4న, 5న?.. 365 వత్తులు ఎలా వెలిగించాలి..కార్తీక మాసం అత్యంత విశేషమైనది. ఈ నెల రోజుల పాటు శివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు వెలిగిస్తే అపారమైన పుణ్యఫలితాలు కలుగుతాయి. ఈ ఏడాది కార్తీక మాసం ఎప్పుడు మొదలైంది, ఈ మాసంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, పౌర్ణమి రోజు ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం.
కార్తీక మాసానికి గల ప్రత్యేకత
కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. శివాలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, దీపారాధనలు జరుగుతాయి. నదీ స్నానానికి కూడా ఈ మాసంలో ఎనలేని మహిమ ఉంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగిస్తే ఏడాది పొడవునా దీపారాధన చేసిన ఫలితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడు?
పంచాంగం ప్రకారం, కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 4 రాత్రి 10:30 గంటల నుంచి మొదలై నవంబర్ 5 సాయంత్రం 6:48 వరకు ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పౌర్ణమి ప్రభావం ఉన్నందున నవంబర్ 5నే ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజు నదీ స్నానం, శివార్చన, దీపారాధన చేయడం ఎంతో శ్రేయస్కరం. పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి, పుణ్యం కలుగుతుంది.
నదీ స్నానం, పూజా ముహూర్తాలు
నదీ స్నానం: నవంబర్ 5 ఉదయం 4:52 నుంచి 5:44 వరకు (బ్రహ్మ ముహూర్తం)
పూజా ముహూర్తం: ఉదయం 7:58 నుంచి 9:00 వరకు
సాయంత్ర దీపారాధన: సాయంత్రం 5:15 నుంచి 7:05 వరకు
365 వత్తులు వెలిగించే ప్రాముఖ్యత
కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు వెలిగిస్తే ఏడాది పొడవునా ఒక్క రోజు కూడా దీపారాధన మానకుండా చేసిన ఫలితం లభిస్తుంది. ఉపవాసం ఉండి ఈ ఆచారం పాటిస్తే భగవంతుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
ఉసిరికాయ దీపారాధన
ఉసిరికాయలో ఆవు నెయ్యి పోసి సాయంత్రం దీపం వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయి. లక్ష్మీదేవి ఉసిరికాయను ఎంతో ఇష్టపడతారని, ఈ ఆచారం వల్ల ధనలాభం, సౌభాగ్యం కలుగుతాయని నమ్మకం. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం కూడా కార్తీక మాసంలో విశేష ఫలితాలను ఇస్తుంది.
365 వత్తులు వెలిగించే సరైన విధానం
వత్తులు వెలిగించే ముందు: అగ్గిపుల్ల లేదా కొవ్వొత్తి ఉపయోగించకూడదు. అగరబత్తితో మాత్రమే వెలిగించాలి.ఎవరు వెలిగించాలి: ఇంటి యజమాని స్వయంగా వెలిగిస్తే అత్యుత్తమ ఫలితాలు…మంత్రం: వత్తులు వెలిగించిన తర్వాత అక్షింతలు చల్లుతూ “దామోదరం ఆవాహయామి” లేదా “త్రయంబకం ఆవాహయామి” అని ఉచ్చరించాలి. ఈ విధంగా కార్తీక పౌర్ణమిని ఆచరిస్తే శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం పొంది సర్వసౌఖ్యాలు కలుగుతాయి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

