BusinessToday gold rate

Gold Rate Today:అయ్యో.. బంగారం ధర మళ్లీ భారీగా పెరిగిందిగా.. ఎంత పెరిగిందంటే..

Gold Rate Today:అయ్యో.. బంగారం ధర మళ్లీ భారీగా పెరిగిందిగా.. ఎంత పెరిగిందంటే.. నవంబర్ 1వ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,020గా నమోదైంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,850గా ఉంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,53,670గా పలుకుతోంది.

నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయినా, ఆల్-టైమ్ రికార్డు స్థాయి కంటే దాదాపు పదివేల రూపాయలు తక్కువగానే ఉన్నాయి. అక్టోబర్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర గరిష్టంగా రూ. 1.35 లక్షలకు చేరింది. అక్కడి నుంచి ధరలు గణనీయంగా పడిపోయాయి. డాలర్ విలువ పెరగడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో బంగారం ధరలు కొంత పుంజుకున్నాయి. కానీ డిసెంబర్‌లో రేట్ల పెంపుపై ఫెడ్ చైర్మన్ స్పష్టత ఇవ్వకపోవడంతో ఊహించినంత ర్యాలీ రాలేదు.

ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది మంచి అవకాశం. ముఖ్యంగా భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సమయంలో ఈ తగ్గుదల వినియోగదారులకు లాభదాయకం.

అయితే, బంగారంలో పెట్టుబడి పెట్టే వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ సేఫ్ హెవెన్‌గా కనిపిస్తున్నా, ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ వైపు మళ్లితే ధరలు మరింత పడే అవకాశం ఉంది.

వెండి విషయంలోనూ ఇదే పరిస్థితి. ఈ నెలలో ఒక దశలో కేజీ రూ. 2 లక్షలకు చేరిన వెండి ధర ప్రస్తుతం దాదాపు 50 వేల రూపాయలు తగ్గి రూ. 1,53,670కి చేరింది. విలువైన లోహాల పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.