Gold Rate Today:భారీగా పడిపోయిన బంగారం ధరలు.. నవంబర్ 2, ఆదివారం పసిడి రేట్లు ఇవిగో.. తులం రూ.1 లక్షకు పడిపోయే అవకాశం…
Gold Rate Today:భారీగా పడిపోయిన బంగారం ధరలు.. నవంబర్ 2, ఆదివారం పసిడి రేట్లు ఇవిగో.. తులం రూ.1 లక్షకు పడిపోయే అవకాశం…నవంబర్ 2వ తేదీ ఆదివారం బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,720గా నమోదైంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,600గా ఉంది. ఒక కేజీ వెండి ధర రూ.1,53,000గా నిలిచింది. నిన్నటి ధరలతో పోల్చితే నేడు బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి.
నవంబర్ 2వ తేదీ ఆదివారం బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,720గా నమోదైంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,600గా ఉంది. ఒక కేజీ వెండి ధర రూ.1,53,000గా నిలిచింది. నిన్నటి ధరలతో పోల్చితే నేడు బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. బంగారం ధరలు పడిపోవడానికి ప్రధాన కారణంగా డాలర్ విలువ పెరగడం ఉందని చెప్పవచ్చు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనా అధ్యక్షుడితో జరిపిన భేటీలో పలు అంశాలపై ఒప్పందం కుదిరిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఈ పరిణామాలతోనే బంగారం ధరలు క్షీణత వైపు మళ్లాయని అంటున్నారు. ముఖ్యంగా మార్కెట్లో బంగారం డిమాండ్ తగ్గడమే ధరల పతనానికి మూల కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం ధరలు సహజంగానే తగ్గుతాయి.
ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఉపసంహరించి అమెరికా ట్రెజరీ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీంతో బంగారం డిమాండ్ తగ్గి ధరలు క్షీణిస్తాయి. బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి ధరల పతనం నిరాశానే కలిగిస్తుంది.
అయితే, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి మాత్రం ఇది శుభవార్త. భారతీయ కుటుంబాల్లో ప్రతి శుభకార్యంలోనూ బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీ. ముఖ్యంగా పెళ్లిళ్లలో బంగారు ఆభరణాలు కానుకలుగా ఇవ్వడం సంప్రదాయం. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గడంతో ఆభరణాల కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి.
డిస్‌క్లైమర్: పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి పెట్టుబడి సాధనాలన్నీ లాభనష్టాలకు లోనవుతాయి. మీ పెట్టుబడులు లేదా వ్యాపారాల వల్ల కలిగే లాభనష్టాలకు chaipakodi ఎలాంటి బాధ్యత వహించదు. పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి.

