Devotional

Tulasi:తులసి మొక్క ఆ దిశలో ఉంటే.. లక్కీ కటాక్షం.. పట్టిందల్లా బంగారమే..

Tulasi:తులసి మొక్క ఆ దిశలో ఉంటే.. లక్కీ కటాక్షం.. పట్టిందల్లా బంగారమే..హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను అత్యంత పవిత్రంగా, పూజనీయంగా భావిస్తారు. ఇందులో శ్రీ మహాలక్ష్మీ దేవి నివసిస్తుందని నమ్మకం. శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రియమైనది. ప్రతిరోజూ విష్ణుమూర్తికి తులసి దళాలు సమర్పిస్తే అపార ఐశ్వర్యం, ఉన్నత స్థానాలు లభిస్తాయి. అందుకే ఇంట్లో తులసి మొక్కను సరైన దిశలో ఉంచితే ఆ గృహంలో ఆనందం, శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను తూర్పు దిశలో నాటాలి. ఇలా చేయడం వల్ల శుభకరమైన ఫలితాలు వస్తాయి. తూర్పు దిశలో స్థలం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులో పెంచుకోవచ్చు. ఈ దిక్కుల్లో తులసి ఉంటే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ కలిసి వస్తుంది.

దేవుడి పూజ కోసం ఉపయోగించే తులసి దళాలను నిత్య పూజ చేసే తులసి కోట నుంచి తీసుకోకూడదు. అలా చేస్తే దారిద్ర్యం పట్టుకుంటుంది. పూజ కోసం ప్రత్యేకంగా మరో చోట లేదా కుండలో తులసి పెంచి, ఆ మొక్క నుంచి మాత్రమే దళాలు సేకరించాలి.

తులసిని రోజూ పూజించి, సాయంత్రం నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై శుభఫలితాలు ప్రసాదిస్తుంది. తులసి మొక్కపై ఏర్పడే విత్తనాలను క్రమం తప్పకుండా తొలగిస్తూ ఉండాలి. అప్పుడే మొక్క నిటారుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. మంగళ, శుక్రవారాల్లో తులసి దళాలు కోయకూడదు. మిగతా రోజుల్లో కోసి పూజలో సమర్పించాలి.

తులసి అత్యంత పవిత్రమైన మొక్క కాబట్టి దక్షిణ దిశలో ప్రతిష్ఠించకూడదు. ఈ దిక్కు పితృదేవతల దిశగా పరిగణించబడుతుంది. దక్షిణంలో తులసి నాటితే భారీ నష్టాలు, కుటుంబంలో కలహాలు సంభవించే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.

ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉంటే తులసి మొక్క నుంచి సేకరించిన గింజలు చల్లితే అనేక మొక్కలు పెరిగి తులసి వనం ఏర్పడుతుంది. ఈ వనం నుంచి వచ్చే గాలి ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. తలనొప్పి, గొంతు నొప్పి, జ్వరం ఉన్నవారు తులసి ఆకులను నీటిలో మరిగించి తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.