Business

BSNL:అతి చౌక ధరలో 50 రోజుల వ్యాలిడిటీ.. రోజుకు 2GB డేటా.. ఆ కంపెనీలకు బీఎస్ఎన్ఎల్ బిగ్ షాక్..

BSNL:అతి చౌక ధరలో 50 రోజుల వ్యాలిడిటీ.. రోజుకు 2GB డేటా.. ఆ కంపెనీలకు బీఎస్ఎన్ఎల్ బిగ్ షాక్..మళ్లీ మళ్లీ రీచార్జ్ చేయాల్సిన ఇబ్బంది లేకుండా.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కావాలా? అయితే బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ సూపర్ బడ్జెట్ ప్లాన్ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. కేవలం రూ.347తో వచ్చే ఈ ప్లాన్‌లో అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి. పూర్తి 50 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ఆఫర్ డీటెయిల్స్‌ను ఇక్కడ తెలుసుకోండి..

గత కొన్ని రోజులుగా ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్.. జియో, ఎయిర్‌టెల్‌లకు షాక్ ఇస్తూ ఒక్కో ఆఫర్ తీసుకొస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది బీఎస్ఎన్ఎల్‌కు మారుతున్నారు. ఇప్పుడు మరో బెస్ట్ ఆఫర్‌తో ప్రైవేట్ టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇచ్చింది. బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ.347కే లభించే ఈ ప్లాన్‌లో సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయి. తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లు కావాలనుకునే యూజర్లను టార్గెట్ చేసి ఈ ప్లాన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ డీటెయిల్స్..
బీఎస్ఎన్ఎల్ ఇటీవల సోషల్ మీడియాలో ఈ రూ.347 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ ప్లాన్‌లో రోజుకు 2GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత స్పీడ్ 80 kbpsకి తగ్గుతుంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా వస్తాయి. ప్లాన్ వ్యాలిడిటీ 50 రోజులు.. అంటే నెలవారీ రీచార్జ్ టెన్షన్ లేకుండా పోతుంది. లాంగ్ టర్మ్ యూస్ కోసం చూస్తున్న యూజర్లకు ఇది బెస్ట్ ఆప్షన్.

ఈ ప్లాన్ ఎందుకు స్పెషల్..
ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోల్చితే బీఎస్ఎన్ఎల్ రూ.347 ప్లాన్ చాలా చీప్ అండ్ బెస్ట్. ఇతర ఆపరేటర్లు ఇలాంటి బెనిఫిట్స్‌ను రెట్టింపు ధరకు ఇస్తున్నారు. కానీ బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరలోనే అందిస్తోంది.. ఇదే గుడ్ న్యూస్. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ 4G సిగ్నల్ బాగా ఉన్న ఏరియాల్లో ఈ ప్లాన్ సూపర్ హిట్ అవుతుంది.

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ అప్‌డేట్
ఇటీవల బీఎస్ఎన్ఎల్ తన నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను భారీగా అప్‌గ్రేడ్ చేసింది. చాలా నగరాల్లో 4G సేవలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మెరుగైన కాల్ క్వాలిటీ, ఫాస్ట్ డేటా స్పీడ్, రిలయబుల్ సర్వీస్‌పై ఫోకస్ పెట్టింది. ఈ రూ.347 ప్లాన్.. కస్టమర్ బేస్ పెంచడం, కొత్త యూజర్లను ఆకర్షించడం కోసం బీఎస్ఎన్ఎల్ చేస్తున్న స్ట్రాటజిక్ మూవ్‌లో భాగం.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.