Business

Instagram vs Instagram Lite:ఇన్‌స్టాగ్రామ్ Vs ఇన్‌స్టాగ్రామ్ లైట్.. రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా?

Instagram vs Instagram Lite:ఇన్‌స్టాగ్రామ్ Vs ఇన్‌స్టాగ్రామ్ లైట్.. రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా..ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు ఎంతో మంది బానిసలైపోతున్నారు. గంటల తరబడి రీల్స్ చూస్తూ మునిగిపోతారు. యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ నిరంతరం కొత్త అప్‌డేట్స్‌తో ముందుకు వస్తోంది. ప్రధాన ఇన్‌స్టాగ్రామ్ యాప్‌తో పాటు, ఇన్‌స్టాగ్రామ్ లైట్ అనే మరో యాప్ కూడా ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు ఏమిటి? ఏది ఉపయోగించడం మంచిది? ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ వినియోగం గణనీయంగా పెరిగింది. యువత రీల్స్‌లో లీనమవుతోంది. గంటలకొద్దీ రీల్స్ చూస్తూ సమయం గడుపుతున్నారు. దీని ద్వారా ఆదాయం కూడా ఆర్జిస్తున్నారు. రీల్స్‌తో ఫేమస్ అయినవారు ఎంతో మంది. యూజర్ల సౌలభ్యం కోసం ఇన్‌స్టాగ్రామ్ క్రమం తప్పకుండా అప్‌డేట్స్ ఇస్తోంది. ప్రధాన యాప్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ లైట్ కూడా అందుబాటులో ఉంది. ఈ రెండింటి మధ్య తేడాలను ఇక్కడ చూద్దాం.

సైజ్‌లో భారీ తేడా
ఇన్‌స్టాగ్రామ్ ప్రధాన యాప్, ఇన్‌స్టాగ్రామ్ లైట్ మధ్య అతి పెద్ద తేడా వాటి పరిమాణం. ప్రధాన యాప్ సైజు చాలా పెద్దది కాబట్టి ఎక్కువ డేటా, ఫోన్ మెమరీని ఆక్రమిస్తుంది. కానీ ఇన్‌స్టాగ్రామ్ లైట్ చాలా చిన్న యాప్. తక్కువ డేటా, నెమ్మదిగా ఇంటర్నెట్‌లోనూ సులభంగా పనిచేస్తుంది. నెమ్మదిగా నెట్‌వర్క్ ఉన్నవారి కోసం మెటా ఈ యాప్‌ను రూపొందించింది.

ఎవరికి ఉపయోగం?
ఇన్‌స్టాగ్రామ్ లైట్ ముఖ్యంగా నెమ్మదిగా ఇంటర్నెట్ ఉన్నవారికి లేదా ఫోన్‌లో తక్కువ స్టోరేజ్ ఉన్నవారికి ఎంతో ఉపయోగకరం. ఇది దాదాపు 170 దేశాల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్ (ఆపిల్) వినియోగదారులకు ఇంకా విడుదల కాలేదు.

లైట్ యాప్‌లో ఏముంటాయి?
లైట్ యాప్‌లో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయవచ్చు. స్టోరీస్ చూడవచ్చు. అయితే ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వంటి కొన్ని ఫీచర్స్ ఇందులో లభించవు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ లైట్ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్‌లలో ఇది లేదు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.