BusinessToday gold rate

Gold Rate Today:గోల్డెన్ న్యూస్ అంటే ఇదే.. భారీగా తగ్గుతున్న ధరలు..

Gold Rate Today:గోల్డెన్ న్యూస్ అంటే ఇదే.. భారీగా తగ్గుతున్న ధరలు.. నేడు నవంబర్ 5వ తేదీ బుధవారం బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,600కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,650గా నమోదైంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,48,688 వద్ద ఉంది. నిన్నటి ధరతో పోల్చితే బంగారం ధర 10 గ్రాములకు రూ. 2,000 తగ్గింది.

గత 10 రోజులుగా బంగారం ధరలు నిరంతరం క్షీణిస్తున్నాయి. అక్టోబర్ 20న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆల్-టైం గరిష్ఠ స్థాయి రూ. 1.35 లక్షలకు చేరింది. అయితే అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ. 1.22 లక్షల వద్ద ట్రేడవుతోంది. అంటే గరిష్ఠ స్థాయితో పోలిస్తే రూ. 13,000 తక్కువగా ఉంది.

బంగారం ధరల తగ్గుదలకు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులే ప్రధాన కారణం. డాలర్ విలువ బలోపేతం కావడంతో బంగారం ధరలు పడిపోతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్సు బంగారం ధర 4,000 డాలర్ల కంటే తక్కువగా ఉండగా, గతంలో 4,400 డాలర్ల వరకు చేరింది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెరగడంతో బంగారంలోని లాభాలను ఇన్వెస్టర్లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో ప్రాఫిట్ బుకింగ్ ఒత్తిడి పెరిగి ధరలు తగ్గాయి.

ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు 50 శాతం పైగా పెరిగాయి. గత కొన్ని సంవత్సరాలుగా కూడా బంగారం ధరలు గణనీయంగా ఎగసాయి.

వెండి ధర విషయానికొస్తే, ప్రస్తుతం ఆల్-టైం గరిష్ఠం కంటే దాదాపు రూ. 50,000 తక్కువగా ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

డిస్‌క్లైమర్: పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది ఎలాంటి పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీ నిర్ణయాలకు chaipakodi బాధ్యత వహించదు. పెట్టుబడి నిర్ణయాల ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి.