Shani effect:శని బాధలతో బాధ పడుతున్నారా.. ఈ రుద్రాక్ష ధరిస్తే మీపై లక్ష్మీ కటాక్షం!
Shani effect:శని బాధలతో బాధ పడుతున్నారా.. ఈ రుద్రాక్ష ధరిస్తే మీపై లక్ష్మీ కటాక్షం… శని దోషాలతో బాధపడుతున్నారా? శని గ్రహ ఇబ్బందులు తొలగి, ఆయన శుభదృష్టి ఎప్పటికీ మీపై ఉండాలంటే పండితులు, పురోహితులు అనేక పూజలు, పరిహారాలు సూచిస్తారు.
కానీ శనైశ్చరుడి కరుణ కటాక్షం ఎల్లవేళలా మీపై ఉండే సరళమైన ఉపాయం ఒకటి ఉంది తెలుసా? అదే రుద్రాక్ష ధారణ! శని దేవుని చల్లని చూపు కోసం ఏ రుద్రాక్షలు ధరించాలి, ధారణ నియమాలు ఏమిటి, ఎప్పుడు, ఎలా ధరిస్తే అద్భుత ఫలితాలు వస్తాయో మీ కోసం వివరంగా…
ఇది కూడా చదవండి:మీ ఇంట్లోనే సినిమా హాల్ గా ఫీల్ పొందాలనుకుంటున్నారా… ఇదే బెస్ట్ ఆప్షన్!
మహాశివుడు మానవాళికి ఇచ్చిన గొప్ప వరం రుద్రాక్షలు. ఆధ్యాత్మిక సాధనతోపాటు జ్యోతిష్య, ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ రుద్రాక్షలను హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. రుద్రాక్షలపై గీతల సంఖ్య ఆధారంగా ముఖాలు నిర్ణయిస్తారు. అనేక ముఖాల రుద్రాక్షలు అందుబాటులో ఉండగా, ప్రతి ముఖం ధారణ వల్ల వేర్వేరు ప్రయోజనాలు ఉంటాయని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో ఏడు ముఖాల రుద్రాక్షను ‘సప్తముఖి రుద్రాక్ష’ అంటారు. దీని ధారణ ప్రయోజనాలు, గ్రహ దోష నివారణకు ఏ రాశులవారు ధరించాలి వంటి ముఖ్య విషయాలు మీ కోసం…
జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
సప్తముఖి రుద్రాక్షకు అధిదేవత శనైశ్చరుడు. జాతకంలో శని బలహీనంగా ఉన్నా, శని మహర్దశ, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటి దశల్లో ఇబ్బందులు ఎదురైనా ఈ రుద్రాక్ష ధారణతో దోషాలు తొలగి అనుకూల ఫలితాలు వస్తాయని జ్యోతిష్య గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇది కామదేవుని రూపంగా కూడా పరిగణించబడుతుంది. పాలక దేవత లక్ష్మీదేవి. సప్త సముద్రాలు, ఏడు దివ్య సర్పాల శక్తి దీనితో ముడిపడి ఉందని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి:నల్ల గుడ్లు vs తెల్ల గుడ్లు.. ఏ రంగు గుడ్లు ఆరోగ్యానికి మంచివంటే..
ఏ రాశులవారు ధరించాలి?
వృషభ, తులా రాశులవారు ఈ రుద్రాక్ష ధరిస్తే జాతక దోషాలు తొలగి, జీవితంలో అభివృద్ధి, ఆరోగ్యం, స్థిరత్వం లభిస్తాయని జ్యోతిష్యం చెబుతోంది.
ధారణ వల్ల ఫలితాలు:
సంపద వృద్ధి, లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లవేళలా.
సప్తమాతృకలు (బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి) ఆశీర్వాదం.
మహాశివుని కృప.
వ్యాపారులకు ఆర్థిక వృద్ధి, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ.
నాయకులకు నిర్ణయాలు తీసుకునే శక్తి, సామర్థ్యం పెంపు (దేవీ భాగవతం, శివపురాణం ప్రకారం).
ఆరోగ్యం: మానసిక ఒత్తిడి, ఫిట్స్, ఆర్థరైటిస్ తగ్గుదల (ఆయుర్వేదం ప్రకారం).
రెండు సప్తముఖి రుద్రాక్షలను బాక్స్‌లో పెట్టి డబ్బు బీరువాలో ఉంచితే ధనాకర్షణ!
ఇది కూడా చదవండి:ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక ఉసిరి తింటే.. పూర్తి ఆరోగ్యం మీదే..
ఎప్పుడు ధరించాలి?
శుక్లపక్ష సోమవారం, మాస శివరాత్రి, మహాశివరాత్రి, కార్తీక మాసంలోని శుభ దినాల్లో ధారణ ఉత్తమం.
ప్రక్రియ:
వెండి గిన్నెలో ఆవు పాలు పోసి రుద్రాక్షను ఉంచి శుద్ధి చేయండి.
అభిషేకం చేసి “ఓం నమః శివాయ” మంత్రం 108 సార్లు జపించండి.
ఉదయం ధరించండి.
నియమాలు:
మాంసం, మద్యం మానండి.కాలకృత్యాల సమయంలో తీసివేయండి.మహిళలు ఋతుకాలంలో తాకరాదు.రాత్రి పూజాగదిలో ఉంచండి.అపవిత్రమైతే గంగాజలంతో శుద్ధి చేసి ధరించండి.
Disclaimer: రుద్రాక్ష ఫలితాలు ఆధ్యాత్మిక విశ్వాసాలు, పురాణాలు, జ్యోతిష్యం ఆధారంగా మాత్రమే. శాస్త్రీయ ఆధారాలు పరిమితం. ధారణకు ముందు గురువు/జ్యోతిష నిపుణులను సంప్రదించండి.

